Kalyan Ram : ‘బింబిసార’ ఓటీటీ అలర్ట్‌

NQ Staff - September 30, 2022 / 10:50 AM IST

Kalyan Ram : ‘బింబిసార’ ఓటీటీ అలర్ట్‌

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఊహించని రేంజ్ లో వసూళ్లు నమోదు చేయడంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో సుదీర్ఘ కాలం తర్వాత ఒక సూపర్ హిట్ పడ్డట్లయ్యింది.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథ చాలా విభిన్నంగా.. వైవిధ్య భరితంగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరించారు.

దాదాపుగా 80 కోట్ల కలెక్షన్స్ ఈ సినిమాకు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఈ సినిమా విడుదల అయ్యి చాలా వారాలు అవుతుంది.. అయినా కూడా ఇప్పటి వరకు ఓటీటీ సంబంధించిన అప్డేట్ ఇవ్వక పోవడంతో నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎందుకు ఓటీటీలో రావడం లేదంటూ కొందరు చర్చిస్తున్నారు.

ఎట్టకేలకు బింబిసార ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.అక్టోబర్ 7వ తారీఖున ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ జీ5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెలువడుతుందని సమాచారం అందుతుంది.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కామెంట్స్ చేశాడు.. ఆయన అన్నట్లుగానే సినిమా బావుందంటూ భారీ కలెక్షన్స్ ని ప్రేక్షకులు ఇచ్చారు. ఇప్పుడు సినిమాకు ఓటీటీ లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. దసరా సందర్భంగా అక్టోబర్ 7వ తారీఖున ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్‌ చేస్తున్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us