MARRIAGE: విడాకులు ఇచ్చిన హీరోయిన్.. రెండో పెళ్లి చేసుకునేందుకు బిలియ‌నీర్స్ క్యూ

సెల‌బ్రిటీల ప్రేమ‌, పెళ్లి విష‌యంలో గ్యారెంటీ అనేదే లేకుండా పోయింది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు అస‌హ్యం వేస్తుందో వారికే అర్ధం కాని ప‌రిస్థితి. తాజాగా టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ భర్త కేన్ వెస్ట్ తో విడాకులు తీసుకోబోతుంది. ఆరు సంవ‌త్స‌రాల వైవిహిక బంధం త‌ర్వాత దంప‌తులు ఇద్ద‌రు విడిపోతున్న‌ట్టు ఈ మ‌ధ్య అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఈ దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు ఉండా, వారి బాధ్య‌త‌ను ఇరువురు స‌మానంగా పంచుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.

మ‌రి కొద్ది రోజుల‌లో కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేయ‌నుంది. అయితే విడాకులు మంజూరు అయిన వెంటనే మళ్లీ పెళ్లి చేసుకుంటాను అంటూ కిమ్ కర్దాషియన్ ఇప్పటికే ప్రకటించింది. దాంతో ఆమెతో జీవితంను పంచుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. హై ప్రొఫైల్ సెలబ్రెటీల నుండి బిలియనీర్ల వరకు ఎంతో మంది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. త‌మ ఆస్తి మొత్తాన్ని ఆమె ముందు ప్ర‌ద‌ర్శించి పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం కిమ్ ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో డేటింగ్‌లో ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమెకు అంతర్జాతీయ గుర్తింపు ఉండ‌డంతో పెళ్లి ఆఫ‌ర్స్ కొల్ల‌లుగా వ‌స్తున్నాయి.