Keerthy suresh : కీర్తి సురేష్ చేసిన పెద్ద మిస్టేక్..లేదంటే బాలీవుడ్‌లో వాళ్ళని మించిపోయేదేమో..?

Keerthy suresh : కీర్తి సురేష్ గురించి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకునేలా చేసిన సినిమా అంటే మహానటి అని ప్రతీ ఒక్కరు చెప్పేస్తారు. అంతగా మహనటి సినిమా కీర్తి కెరీర్ ని తారా స్థాయిలో నిలిపింది. దాంతో తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో వరసగా నటించేందుకు సైన్ చేసింది. వాటిలో ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలని కమిటవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలతో కీర్తి కెరీర్ పీక్స్ కి వెళ్ళడం గ్యారెంటీ అని ఇక ఇప్పట్లో కీర్తి క్రేజ్ కి ఏ ఒక్కరు అడ్డుకట్ట వేయలేరని చెప్పుకున్నారు.

biggest-mostake-done-by-keerthi-suresh
biggest-mostake-done-by-keerthi-suresh

కానీ సీన్ రివర్స్ అయింది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి నిరాశ పరచాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయంటే అవి కీర్తి సురేష్ సినిమాలే. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజైనప్పటికీ పట్టుమని పదిరోజులు కూడా ఎవరూ ఈ సినిమాల గురించి మాట్లాడుకోక పోవడం షాకింగ్ విషయం. దాంతో ఇక కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలని చేయకూడదని ఫిక్స్ అయింది.

Keerthi suresh : కీర్తి రాంగ్ స్టెప్ వేసిందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

కాగా ఇటీవల వచ్చిన రంగ్ దే సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. కీర్తికి కాస్త పేరు కూడా వచ్చింది. కానీ అది సరిపోవడం లేదు. అయితే ఈ మధ్యలో కీర్తి సురేష్ చేసిన పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే అది బాలీవుడ్ సినిమా వదులుకోవడమే. కీర్తి సురేష్‌కి బాలీవుడ్‌లో అవకాశం వస్తే ఒప్పుకొని సైన్ కూడా చేసింది. కానీ సడన్‌గా ఎందుకో డెసిషన్ మార్చుకొని బాలీవుడ్ సినిమా నుంచి తప్పుకుంది. ఆ సినిమా గనక చేసి ఉంటే అక్కడ హీరోయిన్ గా సెటిలయ్యేదేమో. పూజా హెగ్డే, రష్మిక మందన్నలకి వరసగా రెండేసి సినిమాలలో అవకాశం అందుకొని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ విషయంలో కీర్తి రాంగ్ స్టెప్ వేసిందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Advertisement