BiggBoss5 : బిగ్ బాస్ లీక్.. ఈ వారం హౌజ్ నుండి ఆమె ఔట్..!

BiggBoss5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. గేమ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలైతే.. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో షణ్ముఖ్, సన్నీ తప్ప.. మిగిలినవారంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, మానస్ లలో ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంలో ఓ కంటెస్టెంట్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. ప్రియాంక.

BiggBoss5 this week elimination leak
BiggBoss5 this week elimination leak

నిన్న ఎపిసోడ్ లో సింగర్ శ్రీరామ్ టికెట్ లో ఫినాలే గెలుచుకున్నారు. దీని కోసం మానస్ తో హోరాహోరీగా తలపడిన శ్రీరామ్ ఫైనల్ టాస్క్ లో అతడ్ని ఓడించిన ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా ఈ వారం హౌస్ నుండి ఎలిమినేటయ్యే కంటెస్టెంట్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. యాంకర్ రవి ఎలిమినేషన్ తో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు.

BiggBoss5 this week elimination leak
BiggBoss5 this week elimination leak

వీరిలో ఎలిమినేషన్ కొరకు సిరి, మానస్, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ నామినేట్ అయ్యారు. ఇక టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్ ఎలిమినేటయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఫినాలే టికెట్ గెలుచుకున్నంత మాత్రాన అతడు ఎలిమినేట్ అవడానికి అవకాశం లేదని మాత్రం కాదు. కాగా ఈ వారం ప్రియాంక హౌస్ ను వీడనున్నారట. నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో అతి తక్కువ ఓట్లు పొందిన ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారని విశ్వసనీయ సమాచారం అందుతుంది.

ప్రియాంక ఎలిమినేషన్ తో హౌస్ లో ఫుల్ ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకునే అవకాశం కలదు. తన ప్రియుడు మానస్ ని వదిలి పోవడం ప్రియాంకకు నరకప్రాయమే అని చెప్పాలి. మానస్ ని వదిలి వెళ్లలేక ప్రియాంక బిగ్ బాస్ హౌస్ ని కన్నీళ్లతో నింపేస్తుందేమో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆమె చాలా త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక మాత్రం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు.

గేమ్ లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతోనే గేమ్ ఆడుతూ.. నిజంగానే ఓడిపోతుంది ప్రియాంక. బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే ఛాన్స్ ను కూడా ఆమె వినియోగించుకోలేకపోయింది. రెండు ఛాలెంజ్ లు అయ్యేసరికి ఆమె గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ వారం హౌస్ నుంచి కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్. మరేం జరుగుతుందో చూడాలి!