BiggBoss5 : దీప్తిని మిస్ అవుతున్న ష‌ణ్ముఖ్‌.. బ‌య‌ట‌కు వెళ్ల‌మంటూ గేట్స్ ఓపెన్ చేయించిన నాగార్జున‌

BiggBoss5 : బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌స్తుతం 9మంది కంటెస్టెంట్స్ మాత్రేమే ఉన్నారు. వీరు ఇంట్లోకి వ‌చ్చి 70 రోజులు అవుతుంది. త‌మ ఫ్యామిలీని, స‌న్నిహితుల‌ని చాలా మిస్ అవుతున్నారు. ప‌లు సంద‌ర్భాల‌లో కంట క‌న్నీరు పెట్టుకుంటున్నారు. అయితే హౌజ్‌లో ఉన్న‌ప్పుడు బాండింగ్ ఏర్ప‌డడం స‌హ‌జం. అలా ష‌ణ్ముఖ్ సిరి మ‌ధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్ప‌డింది.

BiggBoss5 telugu promo shanmukh and nagarjuna
BiggBoss5 telugu promo shanmukh and nagarjuna

సిరి- షణ్ముఖ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారారు. కానీ కొన్నిసార్లు వారి చేష్టలు చూసిన నెటిజన్లు ఇది ఫ్రెండ్‌షిప్‌ కాదని, మరేదో అయ్యుంటుందని కామెంట్లు చేశారు. మొన్న షణ్ను.. తనను వెళ్లిపో.. అన్నందుకే సిరి ఏకంగా బాత్రూంలో దూరి తల బాదుకుని తనను తాను గాయపర్చుకుంది. ఈ చర్య అటు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. దీంతో వీళ్ల వ్యవహారమేంటో తేల్చుదామని డిసైడ్‌ అయ్యాడు నాగ్‌.

BiggBoss5 telugu promo shanmukh and nagarjuna
BiggBoss5 telugu promo shanmukh and nagarjuna

నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? అని సిరిని నిలదీశాడు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా? అని ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. దీనికి సిరి.. ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదని చెప్తూ ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదు అనుకోవద్దని చెప్తూ ఆమె పరువు తీశాడు.

దీంతో ఓపెన్‌ అయిన సిరి.. షణ్నుతో ఎందుకు కనెక్షన్‌ వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది. ఇదే ప్రశ్న షణ్నుని అడగ్గా అతడు మానసికంగా వీక్‌ అయ్యానన్నాడు. తన ప్రేయసి దీప్తి సునయనను మిస్‌ అవుతున్నానని చెప్పాడు. అంతలా మిస్‌ అవుతే ఈ క్షణమే వెళ్లిపో అంటూ బిగ్‌బాస్‌ ఇంటి గేట్లు తెరిచాడు నాగ్‌.

మరి షణ్ను.. సిరితో తన బంధాన్ని ఏమని నిర్వచిస్తాడు? వారి మనసులో జరుగుతున్న మానసిక సంఘర్షణకు ఈ రోజైన క్లారిటీ వ‌స్తుందా అనేది చూడాలి.