BiggBoss5 : మాన‌స్‌కి ప్ర‌పోజ్ చేసిన ప్రియాంక‌.. ఆశ్చ‌ర్య‌పోతున్న ప్రేక్ష‌కులు

BiggBoss5 : బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చాక కొంద‌రి మ‌ధ్య రిలేష‌న్స్ పుట్టుకొస్తున్నాయి. లేటెస్ట్ సీజన్లో ఓ వింత ప్రేమ కథా చిత్రం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ ప్రియాంక- నటుడు మానస్ మధ్య ప్రేమ చిగురించింది. మొదటివారం నుండే మానస్ అంటే పింకీ అభిమానం పెంచుకుంది. ఒక్క మానస్ తప్ప హౌస్ లో అబ్బాయిలు, అందరూ నాకు అన్నయ్యలే అంటూ.. మనసులో మాట బయటపెట్టింది.

biggboss5 telugu pinky proposes maanas
biggboss5 telugu pinky proposes maanas

మొదట్లో మానస్ ఆమె పట్ల అంత ఆసక్తి చూపించలేదు. అమ్మాయిలకు మించిన అందం ఉన్నప్పటికీ ట్రాన్స్ జెండర్ అనే నిజం, అతన్ని ఆపి వేసి ఉండవచ్చు. అయితే క్రమేణా, అతడు కూడా ఆమెకు దగ్గరయ్యాడు. హౌస్ లో అందరిదీ ఒక ప్రపంచం, వాళ్ళిద్దరిది మరో ప్రపంచం. టాస్క్, ఈవెంట్స్, వంట వార్పు.. ఇంటి పనులు మినహాయిస్తే.. ప్రతి క్షణం ఇద్దరూ కలిసే ఉంటారు.

biggboss5 telugu pinky proposes maanas
biggboss5 telugu pinky proposes maanas

పింకీ అయితే అనుక్షణం… మానస్ నామస్మరణలోనే బ్రతుకుతుంది. తన తిండి కూడా తెచ్చి మానస్ కి పెట్టాలని అనుకుంటుంది. అతడిని ఎవరైనా తప్పుకోగా మాట్లాడితే పింకీకి కోపం వస్తుంది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. తాజాగా అన్ సీన్ ఎపిసోడ్ ప్ర‌సారం కాగా, ఇందులో పింకీ మానస్‌కి ప్రపోజ్‌ చేసింది.

‘నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ అనిపిస్తుంది. ఇది కరెక్ట్‌ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్‌ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది.