BiggBoss5 : సిరి-ష‌ణ్ముఖ్ హ‌గ్గుల విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..రాత్రిపూట ఏంటి ఈ ఘోరం…!

BiggBoss5 : సోమ‌వారం నామినేషన్స్ ఎంత వాడివేడిగా సాగాయో మ‌నం చూశాం. ముఖ్యంగా స‌న్నీనే టార్గెట్ చేశారుగా అన్న‌ట్టు నామినేష‌న్స్ సాగాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో కాజల్-శ్రీరామ్‌ల మధ్య గొడవ కంటిన్యూ అయ్యింది. నాకు ఇష్టం వచ్చినవాళ్లకి సపోర్ట్ చేస్తా.. స్టార్టింగ్ నుంచి నాతో ఎందుకు గొడవపెట్టుకుంటున్నావ్.. నీకు సపోర్ట్ చేసేవాళ్లు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు.. నేను కూడా నీకు హెల్ప్ చేయాలా? అని శ్రీరామ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వార్ నడిచింది.

BiggBoss5 telugu latest episode update
BiggBoss5 telugu latest episode update

ఇక బిగ్ బాస్ హౌస్‌ జంటపాములు షణ్ముఖ్-సిరిలు బెడ్‌లపై కూర్చుని నామినేషన్స్‌పై చర్చించుకున్నారు. రవికి గట్టిగా వేసేశావ్ అని షణ్ముఖ్ అనగా.. సిరి నవ్వుతూ.. ‘నేను పాయింటే మాట్లాడా.. ఎక్కువ తక్కువ మాట్లాడలేదు’ అని అన్నది. శ్రీరామ్ సోలో గేమ్ ఆడుతున్నా అంటుంటాడు.. మరి రవికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అని షణ్ముఖ్ లాజిక్ లాగాడు. ఆ పాయింట్ మీదే నేను రవిని నామినేట్ చేశా అని చెప్పింది సిరి.

BiggBoss5 telugu latest episode update
BiggBoss5 telugu latest episode update

ఇంతకీ మన పొజిషన్ ఏంట్రా అని సిరి అడగ్గా.. షణ్ముఖ్ చిరాకు పడుతూ.. ‘లాస్ట్ వీక్ అనవసరంగా తప్పు చేశాను.. వీళ్లకి పొజిషన్ ఇచ్చేశాం’ అని అన్నాడు. ఏం తప్పు అని ఆ తప్పుకు కారణమైన సిరి ఏమి ఎరగనట్టుగా ప్రశ్న వేసింది. ‘మనిద్దరి ఇష్యూ.. చిరాకుగా ఉంది నాకు’ అని అన్నాడు. సర్లే అయిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని చెప్పింది సిరి.

రాత్రి పడుకునేటప్పుడు సిరికి ఏమైనా పూనకం వస్తుందో ఏమో కానీ.. ఒకే బెడ్‌పై పడుకోవద్దని షణ్ముఖ్ అన్నప్పటి నుంచి సిరి వింత వింతగా ప్రవర్తిస్తూ వస్తుంది. నేటి ఎపిసోడ్‌లో అదే తంతు.. సిరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. పక్క బెడ్‌పై షణ్ముఖ్ ఉండగా.. సిరి తన బెడ్‌పై పడుకుంటూ.. ఐ యామ్ ఇండివిడ్యువల్ అని పేపర్‌పై రాసి తన షణ్ముఖ్ చూసే విధంగా తన బెడ్‌కి అంటించుకుంది. అది చూసిన షణ్ముఖ్ సిరి గాలి తీసేశాడు.

అలా పెట్టి నిన్ను నువ్వు జోక్ చేసుకోవద్దు. జనం నీ గురించి మాట్లాడుకోవాలనే అలా పెట్టావ్. మనిద్దరి సీన్‌ని అందరికీ చూపిస్తున్నావ్.. దీన్నే ఆపుకోమని చెప్తున్నా.. ఇంకొకరు మన గురించి మాట్లాడుకునే అవకాశాన్ని నువ్వే ఇస్తున్నావ్.. నీకు ఏదైనా చెప్పాలని ఉంటే నాతో చెప్పు డైరెక్ట్‌గా ఐ యామ్ ఇండివిడ్యువల్ అని రాసేటంత పెద్ద గొడవ అవ్వలేదు మనిద్దరికీ క్లాస్‌ పీకాడు షణ్ముఖ్. దీంతో సిరి.

ఆ తరువాత ఇద్దరూ ఎప్పటిలాగే మసకమసక చీకట్లో అన్నట్టుగా కౌగిలించుకుని రొమాన్స్‌లో మునిగిపోయారు. షణ్ముఖ్ పడుకుని ఉంటే అతని పైకి ఎక్కేసి సిరి.. హగ్‌లతో రెచ్చిపోయింది. మొత్తానికి ఈ జంట పాములు మాత్రం విడివిడిగా ఉండలేకపోతున్నారనే విషయాన్ని మరోసారి స్పష్ఠం చేశారు. అయితే సిరి తన బెడ్‌పై నుంచి లేచి షణ్ముఖ్ బెడ్‌పైకి వెళ్లడం ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడాన్ని చూసిన సన్నీ షాకయ్యాడు.

చివరి రెండు వారాలు హౌస్‌కి కెప్టెన్ ఉండే అవకాశం లేకపోవడంతో ఈవారం ఎవరైతే కెప్టెన్ అవుతారో అతనే చివరి కెప్టెన్. దీనిలో భాగంగా.. ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు. సైరన్ మోగిన ప్రతిసారీ ఏ సభ్యుడైతే నియంత సింహాసనంపై కూర్చుంటాడో వారు ఆ రౌండ్‌లో సేఫ్ కావడంతో పాటు నియంతగా వ్యవహరిస్తారు. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

అయితే తొలి రౌండ్‌లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో మిగిలిన ఆరుగురికి క్యాప్ హుక్స్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచారు.ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. మిగిలిన ఇంటి సభ్యులకి మరో టాస్క్ ఇచ్చారు. కాళ్లకి చెప్పులు ధరించి ఆ చెప్పుల్ని ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది.. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఈ టాస్క్‌లో కాజల్, రవిలు చివరి స్థానాల్లో నిలవగా నియంత శ్రీరామ్ దగ్గర పంచాయితీ పెట్టారు. అయితే నియంతగా ఉన్న శ్రీరామ్ కాజల్‌ని నెక్స్ట్ రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. రవిని నెక్స్ట్ లెవల్‌కి ప్రమోట్ చేశాడు.ఇక మూడోసారి యాంకర్ రవి.. నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిసభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మానస్, షణ్ముఖ్‌లు నియంత రవి దగ్గర పంచాయితీ పెట్టారు. షణ్ముఖ్‌ని సేవ్ చేసి మానస్‌ని డిస్ క్వాలిఫై చేశాడు.

నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. మిగిలిన ఇంటి సభ్యులకు వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో షన్నూకి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పింది. దీంతో శ్రీరామ్ గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యాడు. ఐదో రౌండ్‌లో భాగంగా.. నియంత సింహాసనంపై కూర్చోవడానికి రవి, షన్నూ, సిరి, ప్రియాంకలు పోటీపడ్డారు.

అయితే బజర్ మోగేసమయానికి సిరి, ప్రియాంకలు ఇద్దరూ ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. అయితే ప్రియాంకకంటే సిరినే ముందు కూర్చున్నట్టుగా విజువల్‌లో కనిపించింది. లోపలికి వెళ్లి నేను కూర్చున్నా.. వాళ్లు అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో షణ్ముఖ్ సీన్‌లోకి వెళ్లి.. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు.. నువ్ ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెప్పాడు ష‌ణ్ముఖ్‌.