BiggBoss5 : ఈ వారం హౌజ్‌ని వీడ‌నున్న కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

BiggBoss5 : తెలుగు అతి పెద్ద గ్ర్యాండ్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఐదవ సీజన్లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అలాగే ప్రతీ వారాంతంలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయని కూడా అందరికీ తెలుసు. అలా ఈ వారాంతం ఎలిమినేషన్ పై లేటెస్ట్ ఇన్ఫో తెలుస్తుంది. ఈ వారం హౌస్ మేట్స్ లో ఒక్క రవి మినహా అంతా నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

BiggBoss5 telugu latest elimination
BiggBoss5 telugu latest elimination

అందరిలో కాజల్, అనీ, సిరిలు మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉండగా.. సిరి ఇద్దరితో పోల్చితే మాత్రం ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె సేవ్ అయ్యారట. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న కాజల్, అనీలలో కాజల్‌కు అనీతో పోల్చితే ఎక్కువ ఓట్లు రావడంతో కాజల్ సేవ్ అయ్యిందని.. దీంతో ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

BiggBoss5 telugu latest elimination
BiggBoss5 telugu latest elimination

తాజా సమాచారం ప్రకారం.. 11వ వారంలో అత్యధికంగా ఓట్లు సంపాదించుకొన్న జాబితాలో వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ ఉన్నట్టు సమాచారం. అయితే దాదాపు వీజే సన్నీ 80వేలకు పైగా ఓట్లు సంపాదించకొన్నట్టు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మిగితా కంటెస్టెంట్లు నిలిచారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

చివరి నిమిషంలో ఏదైనా జరుగవచ్చు. ప్రతీ వారం జరిగినట్టే ఎలిమినేషన్ ప్రక్రియలో మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారనున్నది. మిస్డ్ కాల్ డేటాలో అనీ మాస్టర్ భారీగా ఓట్లు సంపాదించుకొంటే ఆమె సేఫ్ అయి.. మరొకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదనను తెరపైకి తెచ్చారు.

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మానస్ కెప్టెన్ అయ్యారు. ప్రస్తుతం ఎవిక్షన్ పాస్‌కు సంబంధించిన టాస్క్ జరుగుతోంది. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్‌ను పొందనున్నారు. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు.