BiggBoss5 : సిరి,ష‌ణ్ముఖ్‌ల మ‌ధ్య ఏం న‌డుస్తుందో తెలియ‌క ఉక్కిరి బిక్కిరి అవుతున్న ర‌వి

BiggBoss5 : బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో మాన‌స్‌కి గొడ‌లి ద‌క్కిన విషయం తెలిసిందే. అది స‌న్నీకి ఇవ్వ‌గా, అత‌డిని బిగ్ బాస్ కన్ఫెష‌న్ రూంకి పిలిచి స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇచ్చాడు. ఒక‌రి నుంచి స‌గం బంగారు ముత్యాల‌ను తీసుకుని ఇంకొక‌రికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో స‌న్నీ.. సిరి ద‌గ్గ‌ర నుంచి గోల్డ్‌ను మానస్‌కి ఇస్తానని చెప్పాడు. అయితే స‌న్నీ.. మన మధ్య గ్యాప్ ఉంది మామా.. బ్రిడ్జ్ కట్టెయ్ అని అనడంతో.. తన నిర్ణయం మార్చుకుంటూ సిరి దగ్గర తీసుకుని షణ్ముఖ్‌కి ఇస్తున్నట్టు చెప్పాడు.

BiggBoss5 Ravi thinking about siri and shanmukh
BiggBoss5 Ravi thinking about siri and shanmukh

దీంతో షణ్ముఖ్.. సన్నీకి హగ్ ఇస్తూ బ్రిడ్జి కట్టేశావ్ అని అన్నాడు. అయితే సిరి మాత్రం మొహం ఏదోలా పెట్టుకుని నేను ముందే ఎక్స్ పెక్ట్ చేశా అని అన్నది. నువ్వు ఒక నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ప్పుడు దానికే స్టిక్ అయి ఉండాలి, ఎందుకు మార్చుకున్నావ్ అని స‌న్నీ అడిగింది.

BiggBoss5 Ravi thinking about siri and shanmukh
BiggBoss5 Ravi thinking about siri and shanmukh

నువ్ ఆగు.. మానస్‌ని అడిగాలే అని అన్నాడు సన్నీ. ఆ తరువాత షణ్ముఖ్ వచ్చి సన్నీకి థాంక్స్ చెప్పగా.. సిరి మాత్రం నేను సన్నీకి థాంక్స్ చెప్పను.. ఎందుకంటే నా దగ్గర దొబ్బేశాడు అని అన్నది. రేయ్ చెప్పరా అని షణ్ముఖ్ అన్నా.. సిరి నో అనేసింది. ఆ తరువాత మొదటి రౌండ్‌లో ఎక్కువ గోల్డ్ కాయిన్స్ సంపాదించిన మానస్, ప్రియాంకలు మొదటి కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. దీంతో వాళ్లిద్దరికీ ఎయిర్ పంప్‌తో పాటు బెలూన్స్ ఇచ్చి.. గాలి పట్టాలని ఎక్కువగా ఎవరైతే ఎక్కువ బెలూన్స్‌ని బ్లాస్ట్ చేస్తారో వాళ్లే గెలిచినట్టని చెప్పారు బిగ్ బాస్.

ఈ టాస్క్‌లో మానస్‌పై ప్రియాంక గెలిచి మొదటి కెప్టెన్ పోటీదారునిగా నిలిచింది. ఇక ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే.. సిరి రవి కాయిన్స్‌ని నొక్కేసింది. అది చూసిన షణ్ముఖ్.. వరస్ట్‌ రా నువ్.. అన్నీ దొబ్బుడే నీకంటే నేనే బెటర్.. వాళ్లు నీపై పడిపోతారు.. నేను కాపాడాలి అని షణ్ముఖ్ అంటే.. గేమ్ రా అని నవ్వుకుంది సిరి.

ఆ తరువాత మెల్లగా కాజల్ బౌల్ నుంచి కాయిన్స్ నొక్కేసింది సిరి. ఇక కాజల్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన గోల్డ్ మైన్‌లోని కాయిన్స్ నొక్కేసి.. తరువాత బిగ్ బాస్ ఎక్కడ డిస్ క్వాలిఫై చేస్తాడన్న భయంతో మళ్లీ తిరిగి అందులోనే పడేసింది. నిన్ను ఏమైనా మాటలు అన్నాడా? నువ్ ఎందుకంత రియాక్ట్ అయ్యావ్ అని సిరిని అడిగాడు రవి. సిరి నవ్వుతూ ఇద్దరికీ బాగా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది.

వాడి తప్పే కాదు నాది కూడా ఉంది. అని అన్నది. మరి షణ్ముఖ్ నాదే తప్పు అంటున్నాడు ఏంటి? అని రవి అంటే.. సిరి తెగ మురిసిపోయింది. దీంతో రవి.. మీరిద్దరూ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది మీ ఇద్దర్నీ చూస్తే.. ఒకరికోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా సిద్ధమైనట్టు అనిపిస్తుంది అని ర‌వి అన్నాడు.

అయితే సిరి తెగ సిగ్గుపడిపోతూ.. తెగ మురిసిపోతూ వింత వింతగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. రెండో రౌండ్‌లో స‌న్నీ, సిరి బంగారం వెతుకులాట‌లో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్ద‌రిలో ఒక‌రు కెప్టెన్సీ కంటెండ‌ర్ అయ్యే అవ‌కాశాన్ని క‌ల్పించాడు బిగ్‌బాస్‌. అయితే సిరి త‌ర‌పున వేరొక‌రు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి త‌న‌కోసం మాన‌స్ పోటీప‌డ‌తాడ‌ని చెప్పింది. అలా స‌న్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మాన‌స్‌. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండ‌ర్‌ను చేశాడు.

అయితే ఈ గేమ్ నియ‌మ‌నిబంధ‌న‌లు త‌న‌కు ముందే స‌రిగా చెప్ప‌లేదంటూ సంచాల‌కుడైన‌ ర‌వి మీద ఫైర్ అయ్యాడు స‌న్నీ. అలాగే త‌న స్నేహితులు మాన‌స్‌, కాజ‌ల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న త‌న‌ కోపాన్ని త‌గ్గించుకునేందుకు స‌న్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు.