BiggBoss5 : ష‌ణ్ను విష‌యంలో ఏం చేయ‌లేక‌పోతున్నాన‌ని తెగేసి చెప్పిన సిరి

BiggBoss5 : శ‌నివారం నాగార్జున హౌజ్‌మేట్స్‌ని చెడ‌మడా వాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ శ‌నివారం ఎపిసోడ్‌లో ముందు రోజు జ‌రిగిన స‌న్నివేశాల‌ను చూపించాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి జరిగిన రచ్చ మామూలుగా లేదు. సన్నీకి ఇస్తారని ముందే తెలుసు.. అది చెప్పి చేయోచ్చు కదా? ఇన్ని నాటకాలు ఎందుకు అని సిరి, ఆనీ మాస్టర్ బాధపడ్డారు. మానస్ తన నిర్ణయాన్ని చెప్పినా కూడా కాజల్ మాత్రం తన మాటలను మార్చేస్తూ వచ్చింది.

BiggBoss5 nagarjuna asked siri about shannu
BiggBoss5 nagarjuna asked siri about shannu

మానస్.. సిరి పేరు చెబితే కాజల్ ఆనీ మాస్టర్ పేరు చెప్పింది. సరే అని మానస్ ఓ మెట్టు దిగి కాజల్ దారిలోకి వస్తే.. మళ్లీ యూటర్న్ తిరిగింది. చివరకు తన మనసులోని మాటను చెప్పింది. ఇద్దరివి కాలితే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందనేదే తన ఆట అని కాజల్ చెప్పింది. అలా చివరకు కాజల్ పంతం నెగ్గింది. సిరి, ఆనీ మాస్టర్ ఇద్దరి బొమ్మలు కాలిపోయాయి. దీంతో ఆనీ మాస్టర్ అగ్గిలం మీద గుగ్గిలమైంది.

ప్రియాంక మాట విని నేను అక్కడ ఇద్దరి బొమ్మలు కాల్చకుండా ఆగాను. లేదంటే అక్కడే సన్నీ బొమ్మా కాలిపోయేది. కానీ నేను అలా తప్పుగా ఆడలేదు. కానీ కాజల్, మానస్ మాత్రం ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. సిరికి ఇవ్వండని చెప్పినా కూడా ఇవ్వలేదు.. వారు సన్నీకి ఇవ్వాలని అనుకుంటున్నారు.. అదేదో చెప్పి ఇస్తే ఏ బాధ ఉండదు అని ఆనీ మాస్టర్ తెగ ఏడ్చేసింది.

ఇక ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సన్నీ గెలుచుకున్నాడు.. సరైన సమయంలో ఆ పవర్ ఇస్తాను అని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో మానస్, ప్రియాంక, కాజల్, సన్నీలు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఆనీ మాస్టర్ మాత్రం రాత్రంతా కూడా నిద్రపోకుండా బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. ఆ తరువాత నాగార్జున రంగంలోకి దిగాడు. ఎక్స్ కెప్టెన్ అయిన రవితో ఆట ఆడించారు. బంగారం, బొగ్గు అంటూ రెండింటిని ముందు పెట్టారు.

బెస్ట్ పర్ఫామెన్స్‌కు గోల్డ్ ఇవ్వమని, వరస్ట్ పర్ఫామెన్స్ అనుకునే వారికి బొగ్గు ఇవ్వమనే టాస్క్‌ను రవికి ఇస్తాడు. గోల్డ్‌ను ప్రియాంక, మానస్, ఆనీ, శ్రీరామచంద్రలకు ఇస్తాడు. ప్రియాంక టాస్కులు బాగా ఆడిందని, మానస్ చాలా బాగా ఆడాడుకెప్టెన్ అయ్యాడు.. ఆనీ మాస్టర్ టాస్కులు గివ్ అప్ ఇవ్వడం లేదు పోరాడుతోందని, శ్రీరామచంద్ర సెల్ఫ్ లెస్ ఆట ఆడుతున్నాడని గోల్డ్ ఇచ్చాడు రవి.

సన్నీ, కాజల్, సిరి, షన్నులకు బొగ్గును ఇచ్చాడు రవి. మ్యాథ్స్ టాస్క్‌లో సరిగ్గా ఆడలేదని సన్నీ, కాజల్‌లకు బొగ్గునిచ్చాడు రవి. షన్ను అయోమయంగా అయిపోయాడు.. శ్రీరామచంద్ర దగ్గర గోల్డ్ కొట్టేసింది అందుకే ఆమెకు కూడా కోల్ ఇస్తున్నాను అని రవి అన్నాడు. ఇక రవి తనది తాను కోల్ ఇచ్చుకున్నాడు. క్యాలుక్లేషన్స్ ఎక్కువ వేసుకోవడంతో నన్ను నేను కోల్పోయాను అని అనిపించింది.

అలా అన్ని టాస్క్‌లు ముగిసిన తరువాత.. సిరి, షన్ను, మానస్, ఆనీలను కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు నాగార్జున. ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన సూచనలు, పీకాల్సిన క్లాసులను పీకేశాడు. ఇక మొదటగా సిరిని పిలిచాడు. నీ బాధ ఏంటి? ఏమైంది? ఎందుకు అలా తలను బాదుకున్నావ్ అని నాగార్జున అడిగాడు. నేను వెరీ ఎమోషనల్ పర్సన్.. ఆ ఎమోషన్ ఎందుకు వస్తోందో కూడా ఎందుకో అర్థం కావడం లేదు..

ఎదుటి వాళ్లను నేను హర్ట్ చేయను.. ఎవ్వరు నన్ను చేసినా నేనే హర్ట్ అవుతాను..
ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతోంది.. నా స్టోరీ నాకు తెలుసు.. బయట ఏంటో నాకు తెలుసు.. కానీ కనెక్షన్ వస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఇది తప్పా రైటా? అని కూడా తెలియడం లేదు.. బ్యాడ్ అనుకుంటారా? గుడ్ అనుకుంటారా? అని కూడా ఆలోచించడం లేదు. తప్పు అని తెలిసినా కూడా చేసేస్తున్నాు.. ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కూడా ఆలోచించడం లేదు’ అని సిరి బరితెగించినట్టు చెప్పేసింది.

నువ్ ఎలా ఉన్నా, ఏం చేశావ్ అని అడగడం లేదు కానీ నువ్ మాత్రం ఇంకోసారి ఇలా నీది నువ్ గాయపర్చుకోవద్దని సిరికి నాగార్జున సూచించాడు. ఇక జీవితంలో అలా చేయను అని నాగార్జునకు సిరి మాటిచ్చింది. ఆ తరువాత షన్ను లోపలికి వెళ్లాడు. ఏం అయింది.. సిరి అలా చేసుకోవడంలో ఎవరిది తప్పు అని నాగార్జున అడిగాడు. అది నా తప్పే సర్.. నేను అంతలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే.. సిరి అలా చేసి ఉండేది కాదు. ఇకపై అలా జరగనివ్వను అని హామీ ఇచ్చాడు. దీప్తి అంత గుర్తుకు వస్తుంటే.. వెళ్లిపో అని నాగార్జున అన్నాడు.

అంతలా ట్రిప్ అవ్వకు, అయోమయంలో ఉండకు.. నీ ఆట నువ్ ఆడుకో అని షన్నుకి నాగార్జున సలహా ఇచ్చాడు. ఇకపై కొత్త షన్నుని చూస్తారు.. ఇది మళ్లీ రిపీట్ చేయను సర్ అని వెళ్లిపోయాడు. ఆ తరుమాత మానస్ వచ్చాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. కానీ ప్రియాంక విషయంలో ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నావ్ అని నాగార్జున అన్నాడు.

ఆమెకు చెబితే ఏం చేసుకుంటుంది.. ఎలా అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు సర్.. నేను ఆమెకు ప్రతీ సారి చెబుతాను. ఇక్కడకి వచ్చి ఆడటం కోసం. మనకు ఆట ముఖ్యం. బిగ్ బాస్ కప్ ముఖ్యమని చెబుతాను సర్. కానీ ఆమె ఎక్కువగా నా మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది సర్ అని మానస్ తన వర్షన్‌ను వివరించాడు.

అయితే మానస్ మీద ప్రియాంక ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకుందో ఓ వీడియోను చూపించాడు. ఏదైనా సరే నిర్మోహమాటంగా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.. ఇప్పుడు చెబితే ఏమనుకుంటుందో అని అనుకుంటున్నావ్.. ఇంకా ఫీలింగ్స్ ఎక్కువయ్యాక చెబితే? ఎలా ఉంటుంది అని మానస్‌ను ప్రశ్నించాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. ఈ పరిస్థితిని కూడా హ్యాండిల్ చేసుకుంటావ్ అని అనుకుంటున్నానంటూ నాగార్జున సలహా ఇచ్చాడు.

ఆ తరువాత ఆనీ మాస్టర్‌ను లోపలికి పిలిచాడు. మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ అంటే తేడా తెలుసు కదా? ఎక్కడి వరకు ఆపాలో తెలియాలి.. కాజల్ విషయంలో ఇమిటేషన్ స్థాయి దాటిపోతోంది అని ఆనీ మాస్టర్‌కు చురకలు అంటించాడు నాగ్. సారి ఇకపై అలా చేయను. నాలో ఓ చైల్డిష్ బిహేవియర్ ఉంది.. దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాను అని అంది.

అలా మొత్తానికి ఆ నలుగురికి సలహాలు, సూచనలు ఇచ్చేశాడు. ఆ తరువాత శ్రీరామచంద్ర సేఫ్ అయినట్టు ప్రకటించారు. ఆ తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి వివరించారు. నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఉపయోగపడదు. ఎలిమినేషన్ కాకుండా కాపాడుతుంది.. అది నీ కోసమైనా వాడుకోవచ్చు లేదా నీకు నచ్చిన వారి కోసమైనా వాడుకోవచ్చు అని సన్నీకి చెప్పాడు నాగ్. ఇక చివరగా సన్నీ సేఫ్ అయినట్టు టీ షర్ట్ ద్వారా ప్రకటించారు.