BiggBoss5 : బిగ్ బాస్ లీక్.. ప‌ది వారాల త‌ర్వాత కెప్టెన్ అయ్యే అవ‌కాశం వ‌చ్చిందా..!

BiggBoss5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎవ‌రికి వారు సరికొత్త‌గా గేమ్ ఆడుతూ ర‌చ్చ చేస్తున్నారు. మాన‌స్ విష‌యానికి వ‌స్తే కెప్టెన్సీ టాస్క్ ల్లో బెస్ట్ ఇచ్చినా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో చివరకు కెప్టెన్సీని చేజార్చుకుంటూ వచ్చాడు.

TheNewsQube-
biggboss5 manas get captaincy
biggboss5 manas get captaincy

ఎట్టకేలకు బంగారు వేట టాస్క్ లో నెగ్గి కెప్టెన్సీ టాస్క్ లో కూడా విజయాన్ని సొంతం చేసుకుని ఇంటి 11వ కెప్టెన్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో ప్రియాంక.. కాజల్ మరియు మానస్ తప్ప అందరు కూడా కెప్టెన్ లుగా చేశారు. ఇప్పుడు మానస్ కూడా కెప్టెన్ అయ్యాడు. నేడు ప్రసారం అవ్వబోతున్న ఎపిసోడ్ లో మానస్ కు కెప్టెన్సీ బ్యాండ్ రాబోతుంది. ముందుగానే లీక్ అయిన దాని ప్రకారం మానస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విన్నర్ అని తెలుస్తోంది.

biggboss5 manas get captaincy
biggboss5 manas get captaincy

సన్నీ మరియు మానస్ ల స్నేహం కు చాలా మంది అభిమానులు ఉన్నారు. గత సీజన్ లో మెహబూబ్ మరియు సోహెల్ మాదిరిగా ఈ సీజన్ లో కూడా వీరిది మంచి స్నేహం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. వీరిద్దరు కూడా గేమ్ లో తమ బెస్ట్ ఇస్తూ టాస్క్ ల్లో చక్కని ప్రతిభ కనబర్చుతున్నారు.

ఎట్టకేలకు కెప్టెన్ గా మానస్ నిలవడంతో వచ్చే వారం అతడికి ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే అతడు ఇంకా రెండు వారాల పాటు అందే చివరి వారంకు ముందు వరకు ఉండబోతున్నాడు. మానస్ కు పెద్దగా క్రేజ్ లేదు.. అతడు నాలుగు అయిదు వారాల్లోనే బయటకు వస్తాడని కొందరు అనుకున్నారు. కాని అక్కడ హుందాగా ప్రవర్తించడం.. గేమ్స్ లో ది బెస్ట్ ఇవ్వడంతో పాటు అక్కడి వారితో చక్కని రిలేషన్ ను మెయింటెన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది.

టాప్ 5 కి మానస్ అర్హుడు అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. చూస్తుంటే మాన‌స్ టాప్ 5లోనే కాదు టాప్ 3లోను ఉంటాడ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.