BiggBoss5 : ప్రియాంక బ‌ట‌ర్ ఫ్లై.. శ్రీరామ్ చంద్ర నా సొంత సోద‌రుడు… అనీ కామెంట్స్

BiggBoss5 : బిగ్ బాస్ లో సండే ఫండేగా సాగింది. ముందుగా వావ్ తాజ్ టాస్క్‌ని చూపించారు. ఇందులో వావ్ తాజ్‌ను ప్రమోట్ చేశారు. కంటెస్టెంట్లు తమ తమ అభిప్రాయాలను, ఊహలను, ఆశలను పంచుకున్నారు. ఆ తరువాత కంటెస్టెంట్లతో నాగార్జున ఆట ఆడించాడు. ప్రశ్నకు వేళాయే అంటూ.. కంటెస్టెంట్లు వేసిన ప్రశ్నలని.. కంటెస్టెంట్లకే వేసి వాటి సమాధానాలు బయటకు వచ్చేలా చేశాడు.

BiggBoss5 latest weekend episode updates
BiggBoss5 latest weekend episode updates

ఇందులో భాగంగా మొదట శ్రీరామచంద్రకు ప్రశ్నలు వేశాడు నాగార్జున. ఆ ప్రశ్నలు మానస్ సంధించాడు. మాస్కులతో ఉన్నావా? బాగా నటిస్తున్నావా? అని ప్రశ్నలు వేశాడు. తానేమీ మాస్కుతో లేనని, నటించడం లేదని శ్రీరామచంద్ర ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్లకు ఇంటి సభ్యులు అవునంటూ థమ్స్ అప్ బోర్డులను పైకి ఎత్తారు. కానీ కాజల్, మానస్‌లు ఇద్దరే థమ్స్ డౌన్ బోర్డులను చూపించారు. దీంతో శ్రీరామచంద్రకు కాకరకాయ జ్యూస్ కరేలా షాట్ మిస్ అయింది.

ఆ తరువాత సిరికి ప్రశ్నలు సంధించాడు. అవి షన్ను, రవి అడిగారు. షన్ను వల్ల ఆటలో వెనకబడిపోతోన్నావా? అని నాగ్ అడిగాడు. అలా ఏం లేదని సిరి చెప్పింది. బయట మా ఇద్దరికీ పడదు.. ఇక్కడకు వచ్చాకే షన్నుతో ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని సిరి చెప్పుకొచ్చింది. సన్నీ మరీ అంత వైల్డా?, సేఫ్ ప్లేయర్.. ఆట నుంచి ఎందుకు డీవియేట్ అవుతున్నావ్ అంటూ షన్నుకు ప్రశ్నలు సంధించాడు.

సన్నీ కాస్త వైల్డ్‌గా ఆడుతుంటాడు.. నేను మాత్రం సేఫ్ ప్లేయర్ కాదు.. ఏమనిపిస్తే అదే అనేస్తాను.. ఎమోషన్స్ వల్ల కాస్త డీవియేట్ అయినా కూడా మళ్లీ ఆటలోకి వస్తాను అని షన్ను అన్నాడు. నాతో మాట్లాడేందుకు భయపడుతున్నావా? అంటూ షన్ను మానస్‌కు ప్రశ్నను సంధించాడట. అలాంటిదేం లేదని మానస్ క్లారిటీ ఇచ్చాడు. ప్రియాంకతో నీకున్న రిలేషన్ ఏంటి? అని మానస్‌ను సన్నీ అడిగాడు. ఫ్రెండ్స్ అని సింపుల్‌గా చెప్పేశాడు మానస్.

మానస్ నుంచి నువ్ ఏం ఆశిస్తున్నావ్? అని మానసే ప్రియాంకను అడిగాడట. మంచి ఫ్రెండ్స్ అని ప్రియాంక చెప్పింది… కాజల్ కొంచెమైనా నచ్చుతుందా? అని కాజల్ అడిగిందట.. ఎందుకు సిరిని వెనకలా తిడతావ్ అని సిరి అడిగేసిందట. ముందు అనేంత చనువు ఉంది కానీ వెనకాల అనే చనువు లేదని ప్రియాంకకు సిరి కౌంటర్లు వేసింది.

నిజంగానే మానస్‌ను ఫ్రెండ్‌లా ఫీలయ్యావా? అని కాజల్‌ను మానస్ ప్రశ్నించాడు. ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఫీలవుతున్నాను అంటూ మానస్ గురించి కాజల్ చెప్పేసింది. గుంపులోనే ఉంటావా? ఇండిపెండెంట్‌గా ఆడవా? అని కాజల్‌కు ఎవరో ప్రశ్న వదిలారు. వారితో కంఫర్ట్‌గా ఉందని ఉంటున్నాను.. కానీ ఆటల్లో మాత్రం సింగిల్‌గానే, ఇండిపెండెంట్‌గానే ఉంటున్నాను అని కాజల్ చెప్పింది.

ఆ తరువాత స్లైమ్ కలర్ అంటూ గ్రీన్ కలర్ రావడంతో కాజల్ సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. ఆ తరువాత అనుభవించు రాజా టీం వచ్చింది. రాజ్ తరుణ్, సుదర్శన్, హీరోయిన్ కశిష్ ఖాన్ రావడంతో ఇళ్లంతా సందడిగా మారిపోయింది. ఇందులో బొమ్మలు గీసే టాస్క్ ఇచ్చాడు. రెండు టీంలుగా విడొగొట్టారు. కంటెస్టెంట్ల పేర్లను చెబితే.. బొమ్మల రూపంలో వారిని గెస్ చేయాలి. అలా ఈ టాస్క్‌లో షన్ను, సిరిలను హగ్స్ రూపంలో ఆనీ మాస్టర్ గీసి చూపించింది.

ఇక ఇదే టాస్క్‌లో సుదర్శన్ కొన్ని కౌంటర్లు వేశాడు. బయట ఇంకో ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండని సెటైర్ వేశాడు. అలా ఆ టాస్క్ ఎంతో సరదాగా గడిచింది. ఇక కశీష్ ఖాన్ కోసం తెలుసా మనసా అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. చివరకు అనుభవించు రాజా స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. అనుభవించు రాజా టీం మొత్తానికి గుడ్ బై చెప్పేసింది.

ఆ తరువాత మైకులో మాట్లాడటం, చప్పట్లు వస్తే సేఫ్ అయినట్టు అని చెప్పడంతో అందరూ మాట్లాడారు. కానీ మానస్, షన్నులకు మాత్రమే చప్పట్ల సౌండ్స్ వచ్చాయి. దీంతో వారిద్దరూ సేఫ్ అయినట్టు నాగ్ చెప్పేశాడు. ఆ తరువాత డైలాగ్ కొట్టు గురూ అనే టాస్క్ పెట్టాడు.

మొదటగా వచ్చిన మానస్.. నన్ను రెచ్చగొట్టకు అనే డైలాగ్‌ను సన్నీకి ఇచ్చాడు. ఎవ్వరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకు అని అన్నాడు. ఆ తరువాత షన్ను వచ్చి.. నమ్మకం లేదు దొర అనే డైలాగ్‌ను రవికి ఇచ్చాడు. సర్లే సర్లే ఎన్నో చూశాం అనే డైలాగ్‌ను షన్నుకి రవి ఇచ్చాడు. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో అట్ కమల్ హాసన్ అనే డైలాగ్ను రవికి ఆనీ మాస్టర్ ఇచ్చింది.

ఓన్లీ వన్స్ ఫసక్ అనే డైలాగ్‌ను మానస్‌కు ప్రియాంక ఇచ్చింది.. టాస్కులో దిగినే అంతే సర్ అని కారణం చెప్పింది ప్రియాంక. సిరి, షన్నుల హగ్స్ గురించి శ్రీరామచంద్ర కౌంటర్లు వేస్తూ.. ఏమో సర్ నాకు కనపడదు అనే డైలాగ్ను షన్నుకు శ్రీరామచంద్ర ఇచ్చాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్‌ను షన్నుకి సిరి ఇచ్చింది. ఇవే.. మనం హగ్గులు తగ్గించుకుంటే ఇద్దరికీ మంచిది అని సిరి అంటుంది

నీ బొందరా బొంద అనే డైలాగ్‌ను శ్రీరామచంద్రకు కాజల్ ఇచ్చింది. అయిపాయే అనే డైలాగ్‌ను రవికి సన్నీ ఇచ్చాడు. అలా మొత్తానికి ఆ టాస్క్ కూడా పూర్తయింది. ఇక మిగిలిన ఆనీ, ప్రియాంకలను గార్డెన్ ఏరియాలో అడుగులు వేయించాడు నాగ్. చివరకు ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు.

బయటకు వచ్చిన ఆనీ ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. మొదటి నుంచి ఇప్పటి వరకు నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నాడు.. ఇంట్లో అందరినీ అలానే మోటివేట్ చేయాలి.. టాప్ 3లో ఉండాలని రవి గురించి చెప్పింది. శ్రీరామచంద్ర కూడా నాలానే. నీ కోసం ఉన్నానంటూ చెప్పడు. కానీ నాకు అవసరం ఉన్నప్పుడల్లా నాతోనే ఉన్నాడు. నా సొంత సోదరుడు.. ఆయనెప్పుడూ కరెక్ట్‌గానే ఉన్నాడు.. అలానే ఉండు అని శ్రీరాచంద్ర గురించి చెప్పింది.

షన్నుతో అంత కనెక్షన్ లేకపోయినా కూడా.. ఆయన మాట్లాడినప్పుడు మాత్రం నిజాయితీగా మాట్లాడుతాడు. పక్షపాత ధోరణిని చూపించడు.. అలానే ఉండు.. అని షన్నుకు సలహా ఇచ్చింది. సిరి పటాక టాస్కులు బాగా ఆడుతుంది.. ప్రియాంక బట్టర్ ఫ్లై నీ గేమ్ నువ్ ఆడు. కాజల్ గురించి చెప్పడానికేం లేదు.. టాప్ 8లో ఉన్నందుకు కంగ్రాట్స్ అని అంది. బయటకు వచ్చాక మనం మంచి ఫ్రెండ్స్ అవుదామని మానస్‌కు చెప్పింది.