BiggBoss5 : మాన‌స్‌తో గొడ‌వ‌, కొద్ది నిమిషాల త‌ర్వాత అత‌న్ని హ‌గ్ చేసుకున్న ప్రియాంక‌

BiggBoss5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 87వ ఎపిసోడ్‌లో టికెట్ టూ ఫినాలే రేసు మొద‌లైంది. ఫైన‌ల్ చేరుకోవ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో.. పింకీ-మానస్‌లు పక్క పక్కనే కూర్చుని ఉంటారు.. నీకు ఎవరు సపోర్ట్ చేశారు పింకీ అని అడుగుతాడు. ‘నువ్వు’ అని అంటుంది పింకీ. నీకు సపోర్ట్ చేసింది సన్నీ, కాజల్.. ఈ ఇద్దరూ నీకు సపోర్ట్ చేశారు.

BiggBoss5 latest episode update
BiggBoss5 latest episode update

నాకు వేరే ఆప్ష‌న్ లేదు, మ‌రి ఎవర్ని చేయాలి… నిన్ను చేయాలా? అని అంటుంది ప్రియాంక. చేస్తే చేయి అందులో ఏముందని చెప్పిన మానస్.. కాజల్‌కి నువ్ చెప్పిన రీజన్ కరెక్ట్ అని అనుకుంటున్నావా? అని అడగ్గా.. కాదని నేనే అంటున్నా కదా.. మరి నువ్ నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అని మానస్‌ని అడుగుతుంది ప్రియాంక. నేను నిన్ను ఫ్రెండ్ అని అనుకుంటున్నా కాబట్టి నిన్ను నామినేట్ చేయలేదు అంటుంది.

BiggBoss5 latest episode update
BiggBoss5 latest episode update

షణ్ముఖ్, కాజల్‌లలో నీకు సపోర్ట్ చేసింది ఎవరు పింకీ.. అని అడగుతాడు మానస్. కాజల్ అక్క అని చెప్పింది పింకీ.. మరి షణ్ముఖ్‌ని ఎన్నిసార్లు సేవ్ చేశావ్ నువ్వు అని అడుగుతాడు రెండు మూడుసార్లు అని అంటుంది. సేవ్ చేసినందుకు నీకు ఏం చేశాడు.. నీపై కనికరం చూపించాడా? నిన్ను కెప్టెన్‌ని చేశాడా? కనీసం సేవ్ చేశాడా? అని అడుగుతాడు. నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అని అంటాడు.

నేను మాట్లాడుతుంటే అలా లేచివెళ్లిపోతావ్ ఏంటి అని ప్రియాంక అడగ్గా.. నేను మాట్లాడాల్సింది అయిపోయింది.. అని అంటాడు. నేను మాట్లాడుతున్నాగా అని ప్రియాంక అంటే.. మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నావ్.. నువ్ దేనికీ ఒప్పుకోవడం లేదు కదా అని అంటాడు. దీంతో ప్రియాంక కోపంగా అక్కడ నుంచి లేచివెళ్లిపోయి నాకు బాగా విలువ ఇస్తున్నావ్ థాంక్స్ అని అంటుంది. నువ్ కూడా బాగా అర్థం చేసుకున్నావ్ అని అంటాడు మానస్.

నేను మాట్లాడుతుంటే అలా లేచి వ‌చ్చేస్తున్నావు ఎందుకు అని మాన‌స్‌తో ప్రియాంక గొడ‌వ‌ప‌డుతుంది. ఓ పది నిమిషాల తరువాత వచ్చి మాట్లాడతా అని మానస్ అనడంతో.. ప్రియాంక గొడవను పెద్దది చేస్తుంది. దీంతో మానస్‌కి కాలుతుంది.. ప్రియాంక సింగ్ నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు.. నాకు మాట్లాడాలని ఉంది అని అంటుంది ప్రియాంక.

నువ్ అంటేనే నేను ఫీల్ అవుతా మానస్.. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు ఏమైనా అంటే పట్టించుకోను అని ప్రియాంక అనడంతో.. అసలు నువ్ నానుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్ అని అంటాడు మానస్. ఆ మాట మళ్లీ అంటే ఊరుకోను ఇలా అయితే లైఫ్‌లో నేను నీతో మాట్లాడను మానస్ అని అంటుంది ప్రియాంక. మాట్లాడకపోతే మానెయ్.. ఇలా అయితే నువ్ మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని అంటాడు మానస్.

ఇక మానస్‌తో గొడవపడి సిరి దగ్గర బోరు బోరున ఏడ్చేసి సీన్ క్రియేట్ చేసిన ప్రియాంక.. కిచెన్‌లో కర్రీ చేస్తూ ఉప్పు చూడటానికి మానస్ దగ్గరకు పోతుంది.. అతను వద్దని ఉప్పు చాలిందా? కారం చాలిందా? అంటూ ఓవరాక్షన్ చేసి చివరికి మానస్ బుగ్గలు గిల్లి సరదా తీర్చుకుంటుంది పింకీ. అయితే వీళ్ల గొడవ మొత్తం చూసిన సన్నీ.. ‘అసలు ఏంటి పంచాయితీ.. పిచ్చోళ్లు గొడవపడే మీరా? లేదంటే నేనా’ అని అడుగుతాడు.

నువ్ అంటే నచ్చడం లేదని ముందే చెప్పొచ్చు కదా.. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ అని అంటుంది ప్రియాంక. ఆ తరువాత కాజల్-మానస్‌లు మాట్లాడుకుంటూ ఉండగా.. పింకీ వచ్చి మాకు స్పేస్ కావాలి.. నువ్ బయటకు వెళ్లు కాజల్ అని అంటుంది ప్రియాంక. వెంటనే కాజల్ లేచి వెళ్లిపోతూ.. స్పేస్ ఇవ్వడం అంటే ఇదే గుర్తుపెట్టుకో పింకీ అని అంటుంది. దీంతో పింకీ.. మానస్‌పై ఉన్న కోపాన్ని కాజల్‌పై చూపిస్తుంది. నోర్ముయ్ అని రెచ్చిపోతుంది. మానస్ కాజల్‌కి సపోర్ట్ చేయడంతో ప్రియాంక శివాలెత్తుతుంది.

ఆ తరువాత కూడా ప్రియాంక మళ్లీ మానస్ దగ్గరకు వచ్చి.. నీతో మాట్లాడాలి మానస్ అని అంటుంది. వామ్మో నువ్ నన్ను వదిలేట్టు లేవు అని అక్కడ నుంచి లేచివెళ్లిపోతాడు. అయితే ప్రియాంక.. ఆ కోపాన్ని కాజల్‌పై చూపిస్తుంది.. గొడవలు పెట్టేసి ఏమీ తెలియనట్టు కూర్చుటుంది.. అందరూ అంటుంటే తెలియలేదు కానీ.. ఇప్పుడు తెలిసింది.

ఆ తరువాత మానస్ వెళ్లి భోజనంపై కోపగించకు వచ్చి తిను అంటే.. ప్రియాంక ఏడుస్తూ మానస్‌ని హగ్ చేసుకుంటుంది. ప్రియాంక కాజల్‌ని నామినేట్ చేసిందంటే షణ్ముఖ్ చెప్పిన మాటలవల్లే.. అయితే నేటి ఎపిసోడ్‌లోనూ అదే కంటిన్యూ చేశాడు.. ప్రియాంక దగ్గర కూర్చుని నువ్ టాప్ 5లో ఉండాలంటే.. వేరే వాళ్లకి జై కొడితే కావు.. వాళ్లు నిన్ను సెపరేట్ చేస్తున్నారు.. మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కాజల్.. హమ్మయ్య మనోళ్లు అందరూ వచ్చేశారని అన్నది.

సన్నీ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. కాజల్ అతనికి దగ్గరగా ఉంటుంది.. అతని ఫ్యాన్స్ ఓట్లు ఆమెకు పడతాయని.. అని పుల్ల వేశాడు. ఆ మాటతో ప్రియాంక అవునా నిజమా అని అన్నది. ఆ నిజమే.. నువ్ నిజం అని తెలుసుకునే లోపు ఆట అయిపోతుంది.. అంటూ మరో పుల్ల వేశాడు. ఏదేమైన హౌజ్‌లో జ‌రుగుతున్న సీన్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.