BiggBoss5 : సిరి త‌ల్లి మాట‌ల‌కు చాలా ఫీలైన ష‌ణ్ముఖ్‌.. న‌న్ను ఎందుకు దూరం పెడుతున్నావని బాధ‌ప‌డ్డ ప్రియాంక‌

BiggBoss5 : బిగ్ బాస్ హౌజ్‌లో ఇంటి స‌భ్యుల హంగామా మాములుగా లేదు. వాళ్ల ఫ్యామిలీలు రావ‌డంతో ఆనందం హ‌ద్దులు దాటిపోయింది. గ‌త ఎపిసోడ్‌లో కాజల్‌ ఫ్యామిలీ సందడి చేయగా నిన్న‌ శ్రీరామ్‌, మానస్‌, సిరి ఇంటిసభ్యులు వచ్చారు. శ్రీరామ్‌ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు సూచనలు ఇచ్చింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.

TheNewsQube-
BiggBoss5 latest episode upadetes
BiggBoss5 latest episode upadetes

తర్వాత మానస్‌ తల్లి పద్మిని హౌస్‌లో అడుగు పెట్టింది. వచ్చీరావడంతోనే హౌస్‌ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది. పక్కవాళ్లు డిస్టర్బ్‌ చేస్తున్నా డిస్టర్బ్‌ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. ఇక తనను హౌస్‌మేట్స్‌ ఆంటీ అని పిలవగా అక్క అని పిలవండని సూచించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

BiggBoss5 latest episode upadetes
BiggBoss5 latest episode upadetes

అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది. శ్రీరామ్‌.. తనకు, మానస్‌కు మీలాంటి ఒక అమ్మాయిని చూడమని రిక్వెస్ట్‌ చేయగా ప‌ద్మిని.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానంది. అంతలోనే హమీదా వెయిట్‌ చేస్తోందిలే అంటూ పంచ్‌ విసిరింది. ఆమె ఎనర్జీకి మంత్రముగ్ధుడైన శ్రీరామ్‌ నీవన్నీవే, నీవే.. అంటూ అందమైన పాట పాడాడు.

తర్వాత ఆమె అందరికీ వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బీబీ ఎక్స్‌ప్రెస్‌ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్‌మేట్స్‌ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. అనంతరం సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది.

తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని ఆగ్రహించింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి.

‘సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రీదేవి.

శ్రీదేవి మాట‌ల‌కు ష‌ణ్ముఖ్ చాలా ఫీల‌య్యాడు. నా గేమ్‌ కూడా వదిలేసి ఇంత సపోర్ట్‌ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు.చ‌మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది.

నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మానస్‌ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అనంతరం సన్నీ తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోనుంది. ఈ హంగామా నేటి ఎపిసోడ్‌లో ప్ర‌సారం కానుంది.