BiggBoss5 : ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కోసం తంటాలు.. ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారివి..!

BiggBoss5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య్ర‌మం ఎట్ట‌కేల‌కు 75వ రోజుకి చేరుకుంది. ఎవ‌రి స్ట్రాట‌జీస్‌తో వారు గేమ్ ఆడుతున్నారు. శుక్ర‌వారం ఎపిసోడ్‌లో జ‌రిగిన రింగ్ ఈజ్ కింగ్ అనే కెప్టెన్సీ టాస్క్‌లో మానస్ గెలిచాడు. దీంతో ఎట్ట‌కేల‌కు పదకొండో వారంలో ఇంటి కెప్టెన్‌గా మారాడు. రింగ్‌ను ప‌ట్టుకోవ‌డంలో మొదటగా ఆనీ మాస్టర్ కిందపడిపోయింది. ఆ తరువాత సిరి కింద పడిపోయింది. చివర్లో ప్రియాంక రెండో చేతిని వాడటంతో చివరకు మానస్ టాస్క్‌లో గెలిచినట్టు అయింది.

TheNewsQube-
BiggBoss5 latest episode manas win captaincy task
BiggBoss5 latest episode manas win captaincy task

కాజ‌ల్ త‌న బాధను స‌న్నీతో చెప్పుకొని బాధ‌ప‌డింది. త‌న‌తో స‌రిగా ఉండ‌డం లేద‌ని కాజ‌ల్ చెప్పడంతో అప్పుడు స‌న్నీ వాడికి నువ్వంటే ఇష్ట‌మ‌ని చెబుతాడు. అంత‌లోనే మాన‌స్ రాగా, అత‌నిని సారీ చెప్ప‌మ‌ని అడుగుతుంది. చెప్ప‌ను చెప్ప‌ను అంటూనే సారీ చెప్పేస‌రికి మాన‌స్‌ని గ‌ట్టిగా హ‌త్తుకుంది కాజ‌ల్. చివరకు సన్నీ కూడా జాయిన్ అయ్యాడు.

BiggBoss5 latest episode manas win captaincy task
BiggBoss5 latest episode manas win captaincy task

మానస్ కెప్టెన్ కావడంతో సన్నీ, కాజల్ తెగ సంబర పడిపోయారు. సన్నీ అయితే ఏకంగా మానస్‌కు ముద్దులు పెట్టేశాడు. మానస్ కూడా తిరిగి ముద్దులు పెట్టాడు. ఏరా పెదవుల మీద ముద్దు పెడతావా? నేను ఇంకా వర్జిన్‌రా ఇంత వరకు ఎవ్వరికీ పెట్టలేదు అని సన్నీ అనడంతో.. కాజల్ షాకై చూసింది. ఇది నిజం నమ్ము అని సన్నీ అంటాడు.

ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి టాస్క్ మొదలైంది. ఎలిమినేషన్‌ను తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. దీని కోసం గార్డెన్ ఏరియాలో పెద్ద సెటప్ వేశాడు. ఫైర్ ఇంజన్, ఇళ్లు కాలిపోవడం అంటూ టాస్క్‌ను వివరించారు. సమయానుసారంగా సైరన్లు మోగుతాయి. ఆ సమయంలో ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కిన ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరిని కాపాడాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి ఫోటోలు కాలిపోతాయి. ః

అలా చివరి వరకు ఎవరి ఫోటో అయితే కాలిపోకుండా ఉంటుందే వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతమవుతుందని తెలిపాడు. ఈ క్రమంలో మొదటి సైరెన్‌కు రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. వారికి శ్రీరామచంద్ర, మానస్ ఫోటోలు వచ్చాయి. అందులోంచి శ్రీరామచంద్రను సేఫ్ చేసి.. మానస్ ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత మానస్ సన్నీలు ఎక్కారు. వారిద్దరు కలిసి ఆనీ మాస్టర్, రవిలోంచి.. ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేశారు. రవి ఫోటోను కాల్చేశారు.

ఆ తరువాత సిరి, షన్ను ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కారు. సన్నీ, ప్రియాంకలోంచి.. సన్నీని కాపాడారు.. ప్రియాంక ఫోటోను కాల్చారు. ఆ తరువాత ఆనీ, శ్రీరామ ఫైర్ ఇంజన్ ఎక్కేసి..సిరి, షన్నులోంచి సిరిని సేఫ్ చేశారు.. ఆ తరువాత కాజల్ ప్రియాంక ఎక్కి.. సిరి, శ్రీరామలోంచి సిరిని సేఫ్ చేశారు. ఆ తరువాత ఆనీ, ప్రియాంక ఫైర్ ఇంజన్ ఎక్కి.. సన్నీ, కాజల్‌లోంచి..సన్నీని సేఫ్ చేశారు.

మానస్, కాజల్ ఫైర్ ఇంజన్ ఎక్కుతారు. వారికి ఆనీ, సిరిలోంచి ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇద్దరూ ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి బొమ్మలు కాలిపోతాయ్. చివరకు సన్నీ మిగిలిపోతాడు. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది. ఇది కాజల్ మనసులో ఉన్న గేమ్. కానీ ముందుగా ఇవేమీ చెప్పదు. తాను సిరికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ కాజల్ మొదలుపెడుతుంది. నాకు ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేయాలని ఉందని మానస్ అంటాడు.

ఎంతకీ ఏకాభిప్రాయం రాదు. అయితే చివరకు వేరే దారి లేక.. కాజల్ దారిలోకే వస్తాను అని మానస్ అంటాడు. నేను కూడా సిరినే సపోర్ట్ చేస్తాను అని అంటాడు. అయితే నేను ఆనీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తాను అని అంటుంది. అదేంటి ఇంతకు ముందు సిరి అన్నావ్ కదా? అని మానస్ అడిగితే.. అవును ఇప్పుడు ఆనీ మాస్టర్ అంటున్నాను అనేసింది కాజల్. అలా కాజల్ ఇచ్చిన దెబ్బకు మానస్ షాక్ అవుతాడు. ఇద్దరివి కాలిపోతే సన్నికి పాస్ వస్తుందని కాజల్ అంటుంది. అలా ఆడను.. అది తప్పు.. ఎవరో ఒకరిని సేఫ్ చేయాలని మానస్ అంటాడు. కానీ కాజల్ మాత్రం ఒప్పుకోదు.

సన్నీకి ఎవిక్ష‌న్ ఫ్రీ ప్రాస్ అందించేందుకు కాజ‌ల్ వేసిన స్కెచ్‌గా ఇది తెలుస్తుంది. నేటి ఎపిసోడ్‌లో స‌న్నీ ఎవిక్ష‌న్ పాస్ అందుకోబ‌తున్న‌ట్టు స‌మాచారం.