BiggBoss5 : మందుకొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక‌వుతున్న ఆడియ‌న్స్

BiggBoss5 : ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి అంద‌మైన భామ‌లు చాలా మందే వ‌చ్చారు. కొన్నాళ్లు త‌మ అంద‌చందాల‌తో ర‌చ్చ చేశారు. అయితే వారంతా తొంద‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. కాని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మాత్రం ఆప‌లేదు. టాప్ 5లో తప్పక ఉంటుందని భావించిన బ్యూటీ భామ లహరి షారి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది.

TheNewsQube-
BiggBoss5 Lahari sip wine and pose her latest pics viral
BiggBoss5 Lahari sip wine and pose her latest pics viral

ల‌హ‌రి తాజాగా ఓ పెగ్గు వేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంట్వర్యూలో సైతం ఆమె తనకు మందు.. సిగరెట్ అలవాటు ఉందని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సరదగా ఓ వీడియో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. వివిధ బ్రాండ్ ల మందు బాటిళ్లను ముందు పెట్టుకుంది. డబ్ స్మాష్ తో సందడి చేసింది. ఆ వెంటనే ఓ పెగ్ సిప్ చేస్తూ కొన్ని ఫోటోలు పెట్టింది. అయితే పెగ్ వేయడంలో కూడా ఇంత స్టైలా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

BiggBoss5 Lahari sip wine and pose her latest pics viral
BiggBoss5 Lahari sip wine and pose her latest pics viral

లహ‌రి హౌస్ లో అందాల ఆరబోతతో హాట్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా..హాట్ హాట్ లుక్కులతో ఫోటోలు పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. లహరి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే.. యాంకర్‌ కమ్ న్యూస్‌ రీడర్‌ కమ్ జర్నలిస్టు కమ్ మోడల్‌ కమ్ నటి అని చెప్పాల్సి ఉంటుంది.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాక ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది. అక్కడి నుంచి వరుస సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

బిగ్ బాస్ నుండి ఆమె అంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈమె ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడు వారాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇంత త్వరగా బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఆమె కూడా అనుకోలేదు.