BiggBoss5 : ఆ స‌మ‌యంలో నేను సిరి చెంప ప‌గ‌ల‌గొట్టేవాడిని అన్న జ‌స్వంత్

BiggBoss5 : ఈ సారి సీజ‌న్ లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న జంట సిరి-ష‌ణ్ముఖ్‌. వీరిది ప్రేమ‌నా, ఫ్రెండ్‌షిప్పా అనేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్‌ చేయలేకపోతున్నారు.

BiggBoss5 jeshwanth about siri
BiggBoss5 jeshwanth about siri

ఎంతో మంది షోని చూస్తున్నార‌ని తెలిసి కూడా ష‌ణ్ముక్-సిరి హద్దులు మీరి హగ్గులు, కిస్సులు ఇచ్చుకోచడం ఫ్యామిలీ ఆడియోన్స్‌ను సైతం రుచించడం లేదు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ముందున్నారు. ఫాలోయింగ్ పరంగా టాప్‌లో ఉన్న వీళ్లిద్దరూ.. ఆటలోనూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

BiggBoss5 jeshwanth about siri
BiggBoss5 jeshwanth about siri

హౌస్‌లో వీళ్లిద్దరూ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిత్యం రొమాన్స్ చేస్తూనే ఉంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ స్నేహితులుగా ఉన్నా.. ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని అన్నాడు.

బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు. ఇక షణ్నూ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్‌ చేశాడు. కాగా, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బయట స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి గొడవలు పెట్టుకుని అలుగుతున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి అసలు ఏం జరుగుతుందోనన్న అనుమానాలు కలిగిస్తున్నారు.