BiggBoss5: హ‌గ్గుల‌తో రెచ్చిపోయిన సిరి-ష‌ణ్ముఖ్‌… ఏం జ‌రుగుతుందో అర్ధం కాక క‌న్ఫ్యూజ‌న్‌లో ఫ్యాన్స్

BiggBoss5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో సిరి,ష‌ణ్ముఖ్ ఫ్రెండ్స్ అంటూనే నానా హంగామా చేస్తున్నారు. క‌లిసిక‌ట్టుగా గేమ్ ఆడుతున్న వారిద్ద‌రు ఎమోష‌న‌ల్‌గా కూడా బాగానే క‌నెక్ట్ అయ్యారు. ఇక స‌న్నీని టార్గెట్ చేస్తుండ‌డం ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నాడు. అయితే ష‌ణ్ముఖ్‌..స‌న్నీతో గేమ్ విష‌యంలో ప‌లు సూచ‌న‌లు ఇస్తూ వ‌స్తున్నాడు.

BiggBoss5 again siri and shannu getting emotional
BiggBoss5 again siri and shannu getting emotional

స‌న్నీతో దూరం త‌గ్గించుకునేందుకు పవర్ రూంలోకి వెళ్లిన రవి.. తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి ఇస్తానని నిర్ణయించుకున్నాడు. నాకు ఏ పవర్ అవసరం లేదని అన్నాడు. కానీ ఇది బిగ్ బాస్ నిర్ణయం.. తీసుకోవాల్సిందే అని అన్నాడు. ఇది మంచి ఉద్దేశ్యంతోనే ఇచ్చాను అని రవి కన్విన్స్ చేశాడు. అ పవర్ నేను వాడను అని అన్నాడు. కానీ చివరకు బిగ్ బాస్ ఆదేశంతో సన్నీ ఆ పవర్‌ను వాడాడు.

హెల్మెట్ సొంతం చేసుకుని గోల్డ్ మైన్ చేసేందుకు రెడీగా ఉన్న మానస్, ఆనీ, శ్రీరామచంద్రలోంచి ఎవరో ఒకరిని తప్పించి.. ఆ స్థానంలో గోల్డ్ మైన్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది ఆ పవర్. దీంతో శ్రీరామచంద్రను పక్కకు తప్పించాడు. ఆ స్థానంలో సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మానస్, ఆనీ మాస్టర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో బంగారం ఉండటంతో ఆ ఇద్దరికీ ఓ టాస్క్ పెట్టాడు.

ముళ్లు వేయమని ఓ టాస్క్ఇవ్వగా.. అందులో మానస్ ఓడిపోయాడు. ఆనీ గెలిచింది. అలా మొత్తానికి ప్రియాంక, సిరి, ఆనీలు కెప్టెన్సీ కంటెండర్లు మారారు. మరో కంటెండర్ కోసం ఎక్కువ గోల్డ్ ఉన్న ముగ్గురు సభ్యులను తెలియజేయమన్నాడు బిగ్ బాస్. మానస్, సన్నీ, కాజల్ వద్దే ఎక్కువగా ఉండటంతో ఆముగ్గురికి మరో టాస్క్ పెట్టారు. మ్యాథ్స్ టాస్క్ అంటూ 17 నంబర్లతో మొత్తంగా 143 వచ్చేలా నంబర్ బోర్డులను తగిలించాలన్నాడు. దీంతో మానస్ గెలిచాడు. అలా నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు.

టాస్క్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సిరి,ష‌ణ్ముఖ్ మధ్య గొడ‌వ జ‌రిగింది. ఐ హేట్ యూ అంటూ లిప్ స్టిక్‌తో టిష్యూ మీద రాసి షన్నుకు ఇచ్చింది. ఐ హేట్ యూ ఏంట్రా.. అరేయ్ నేను ఏం చేశాను రా అంటూ సిరిని షన్ను అడిగాడు. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో చూసే ప్రేక్షకుడికి ఏం అర్థం కాలేదు. మళ్లీ కాసేపటికే ఇద్దరూ ఘాఢంగా హత్తుకున్నారు. ఆ సమయంలో కావాలని జరిగిందో లేక తెలీకుండా జరిగిందో కానీ ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నట్టు అనిపించింది.

బిగ్ బాస్ టీం కూడా వాటిని బ్లర్ చేసి చూపించింది. దీంతో అక్కడ ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాలేదు. ఓ వైపు దీప్తి టాటూను చూసి షన్ను, శ్రీహాన్ ఉంగరాన్ని చూసుకుని సిరి కాస్త ఫీలయ్యారు. కానీ మళ్లీ ఇలా హద్దులు మీరి రొమాన్స్ పండిస్తున్నారు. త‌ర్వాత ఇంటిస‌భ్యుల‌తో కొన్ని క్ష‌ణాలు ఇంటికి అంకితం అనే స‌ర‌దా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్‌. ఇందులో జంట‌లుగా విడిపోయిన హౌస్‌మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూత‌ద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. ఫైన‌ల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్ట‌ర్‌- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచ‌ర్ గెలుపొందింది.

అనంత‌రం ఓ బెడ్డు మీద హగ్గులతో సిరి, షన్నులు రెచ్చిపోతున్నారు. మరో వైపు ఇంకో బెడ్డు మీద మానస్ పడుకుని ఉన్నాడు. అక్కడ ప్రియాంక, మానస్ గోల జరిగింది. నన్ను కనీసం మనిషిలా చూడు.. అది చాలు అంతకంటే నేను ఎక్కువేమీ ఆశించడం లేదు అని ప్రియాంక తన బాధను చెప్పుకుంది.