Anchor Ravi: యాంక‌ర్ ర‌వికి మొద‌ట్లోనే షాక్.. లేడీస్‌లో జోరుమీదున్న సిరి

Anchor Ravi:బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సీజ‌న్ 5 జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో అనుమానాల నడుమ మొద‌లైన సీజ‌న్ 5 కార్య‌క్ర‌మానికి 19 మంది కంటెస్టెంట్స్ హాజ‌ర‌య్యారు. టెలివిజన్ హిస్టరీలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసుకుంటున్న బిగ్ బాస్ కార్యక్ర‌మం ఐదో సీజ‌న్‌కి కూడా నాగార్జున‌నే చీఫ్ గెస్ట్‌గా ఉన్నారు.

Anchor Ravi's Craze has decreased &BiggBoss Siri's Craze is increasing more
Anchor Ravi’s Craze has decreased &BiggBoss Siri’s Craze is increasing more

సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు సీజ‌న్ 5 కంటెస్టెంట్స్‌గా ఉండ‌గా.. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి మధ్య టైటిల్ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.


బిగ్ బాస్ షోకి హాజ‌రైన కంటెస్టెంట్స్‌కి సంబంధించి మా ట్విట్ట‌ర్ పేజ్‌లో అంద‌రి ఫొటోల‌ను షేర్ చేసింది .ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువ రియాక్షన్లు (లైకులు, కామెంట్లు, రీట్వీట్లు) అందుకున్నది మాత్రం షణ్ముక్ జస్వంతే. అత‌నికి భీబ‌త్స‌కరంగా స‌పోర్ట్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లు,డ్యాన్స్,ప‌లు యూట్యూబ్ వీడియోల‌తో ఎంతో క్రేజ్ పొందిన ష‌ణ్ముఖ్ .. యాంక‌ర్ ర‌వి క‌న్నా కూడా ఎక్కువ మ‌ద్ద‌తు పొందుతున్నాడు. ఇది నిజంగా యాంక‌ర్ ర‌వికి షాక్ క‌లిగించే విష‌యమ‌ని అంటున్నారు.


ఈ సారి బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి తొమ్మిది మంది ఆడవాళ్లు కూడా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ మా ట్విట్టర్ పేజ్‌లో ఎక్కువ రియాక్షన్లు అందుకున్న కంటెస్టెంట్ సిరి హన్మంతే. ఆమె తర్వాత 7 ఆర్ట్స్ సరయు, ప్రముఖ నటి ప్రియలకు ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. రానున్న‌రోజుల‌లో ఇవేమైన మార‌తాయా అనేది చూడాలి.