BiggBoss Priya : ప్రియ ఇంట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర‌చ్చ‌.. వీళ్లంద‌రు క‌ల‌వ‌డానికి కార‌ణం?

BiggBoss Priya : బిగ్ బాస్ నుండి ఏడో వారం ఎలిమినేట్ అయిన ప్రియ అంద‌రి మాదిరిగా కాకుండా స‌ర‌దాగా న‌వ్వుకుంటూనే బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె ప్రతి సభ్యునికి రిపోర్ట్ కార్డ్ ఇవ్వాలని నాగార్జున చెప్ప‌డంతో లోబో.. తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది.

TheNewsQube-
BiggBoss Priya and other get to gather in a marriage
BiggBoss Priya and other get to gather in a marriage

ఇక రవి గేమ్ బాగా ఆడుతున్నాడని ఏడు మార్కులిచ్చింది. ఇక షణ్ముఖ్ వండర్ ఫుల్ పర్సన్ అని… తన మైండ్ తో గేమ్ ఆడుతున్నాడని… తనలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలంటూ ఎనిమిది మార్కులిచ్చింది. అలాగే సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులిచ్చింది.. ఇక శ్రీరామ్ తనకు కనెక్ట్ కాలేదంటూనే ఎనిమిది మార్కులేసింది. బయటకు వచ్చాక తనకు సాంగ్ నేర్పించాలని గుర్తుచేసింది.

BiggBoss Priya and other get to gather in a marriage
BiggBoss Priya and other get to gather in a marriage

త‌నకు ఎంతో ఇష్టమైన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసింది. పొద్దున లేవగానే పింకీని చూస్తానని.. ఆమెను చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది. అలాగే యానీ మాస్టర్ అందరినీ సులువుగా నమ్మేస్తారని పది మార్కులేసింది. అలాగే.. జెస్సీ గేమ్ బాగా ఆడుతున్నాడంటూ ఎనిమిది మార్కులేసింది.

మానస్ బంగారుకొండ అంటూ పది మార్కులేసింది. చిన్నవయసులోనే చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పుకొచ్చింది.. ఇక సన్నీకి 9 మార్కులేస్తూ.. తన ప్లేటులో తినే రైట్.. నా కప్పులో తాగే హక్కు నీకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది ప్రియ. స‌న్నీతో ఎక్కువ గొడ‌వ ప‌డ‌డం వ‌ల‌నే బ‌య‌ట‌కు వ‌చ్చింది ప్రియా.

బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా అందరు క‌లిసి సంద‌డి చేస్తున్నారు. తాజాగా ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ‘మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ’ అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది.