BiggBoss : లక్కీ ఫైమా.! ఫాఫం రాజ్.! ఇదేం న్యాయం బిగ్ బాస్.?

NQ Staff - November 28, 2022 / 10:49 AM IST

BiggBoss : లక్కీ ఫైమా.! ఫాఫం రాజ్.! ఇదేం న్యాయం బిగ్ బాస్.?

BiggBoss : ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైమాని వరించింది. అది కూడా, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల. బిగ్ హౌస్‌లో నడిచిన రాజకీయాలతో ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది తప్ప, నిజానికి ఆమె కష్టపడి సాధించిందేమీ కాదు.

ఎలాగైతేనేం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకుంది.. దాన్ని వాడేసుకుంది.. ఎలిమినేషన్‌ని తప్పించుకుంది. ఇదేం న్యాయం బిగ్ బాస్.? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల పరంగా కింది స్థానంలో వున్న ఫైమా, ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల గట్టెక్కేసింది. కింది నుంచి రెండో స్థానంలో వున్న రాజ్ ఔట్ అయిపోయాడు.

ఈ డొంక తిరుగుడేల.?

రాజ్‌ని పంపించెయ్యాలనుకుంటే నేరుగా ఎలిమినేట్ చేసి పారేయ్యొచ్చు. దానికి ఇంత హైడ్రామా ఎందుకు.? అదే బిగ్ బాస్ అంటే. ఇందులో జెన్యూనిటీ, రియాల్టీ అనే వాటి గురించి వెతక్కూడదు. నేతి బీరకాయలో నెయ్యి.. బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ.. రెండూ ఒకటే.

నిజానికి రాజ్ ఇంతకు ముందే ఔట్ అయిపోవాల్సి వుంది. కానీ, ఇమ్యూనిటీ పేరుతో రాజ్‌ లైఫ్‌ని బిగ్ హౌస్‌లో కాస్త పొడిగించారు.. ఇక అనవసరం అనుకుని ఇంటికి పంపించేశారన్నమాట.

‘నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్ నా కోసం వాడుకోను..’ అని ఘంటాపథంగా చెప్పిన ఫైమాతో ఆ పాస్ వాడుకునేలా చేశాడు కింగ్ నాగార్జున. ఆట ఆడేది బిగ్ బాస్ నిర్వాహకులే.. నాగార్జున అయినా, కంటెస్టెంట్లు అయినా జస్ట్ ఆటగాళ్ళంతే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us