Ram Charan : రామ్ చ‌ర‌ణ్ చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Ram Charan : మెగాపవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్త‌య్యింది. శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Biggboss contestants in Ram Charan and shankar movie
Biggboss contestants in Ram Charan and shankar movie

ఈ మూవీలో స‌రికొత్త పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను శంక‌ర్ ప్రెజంట్ చేయ‌బోతున్నారు. ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు మెగాభిమానుల అంచనాల‌ను మించి సినిమా ఉంటుంది. కొర‌టాల శివ‌ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోక‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది.

Biggboss contestants in Ram Charan and shankar movie
Biggboss contestants in Ram Charan and shankar movie

ఇదిలా ఉంటే సినిమాలో హైలైట్ అయ్యేలా ఓ సీన్ ప్లాన్ చేసిన శంక‌ర్, అందుకోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గొద్దని నిర్మాతలకు సూచించారట. ఈ సినిమా కోసం భారీ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని, అయితే అందులో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది.

7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఏ సినిమాలో చూడని రేంజ్‌లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుండటం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

ఈ చిత్రంలో బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్స్ అయిన లోబో మరియు విశ్వలకు ఆఫర్ వచ్చిందట. వీరిద్దరు రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల రామ్ చరణ్ బిగ్‌బాస్ షోకు అతిధిగా వెళ్లిన విషయం తెలిసిందే.