Baladhitya బిగ్‌బాస్‌ : బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్‌, మా ఆయనకి వెన్ను పోటు

NQ Staff - September 22, 2022 / 10:42 AM IST

160049Baladhitya బిగ్‌బాస్‌ : బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్‌, మా ఆయనకి వెన్ను పోటు

Baladhitya : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో బాలాదిత్య ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా బాలాదిత్య తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన వందల సంఖ్యల సినిమాల్లో నటించి మెప్పించాడు.

BiggBoss Baladhitya Wife Shocking Comments on Backstapping

BiggBoss Baladhitya Wife Shocking Comments on Backstapping

ముఖ్యంగా చిన్నప్పుడు చిచ్చర పిడుగుగా కనిపించి ఆకట్టుకున్నాడు. పెద్దయ్యాక హీరో అవ్వాలని ప్రయత్నించిన కూడా అంతగా సక్సెస్ అవ్వలేక పోయాడు. బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలాదిత్య ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు.

గతంలో ఆయనను వెండి తెరపై చూసిన వారు ఇప్పుడు బుల్లి తెర అది కూడా బిగ్‌ బాస్ లో చూసి చాలా మంది సర్ప్రైజ్ అవుతున్నారు. బాలాదిత్య తీరుని ప్రశంసిస్తున్నారు. చాలా సౌమ్యంగా తన ఆట తీరును కొనసాగిస్తున్నాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. కొందరు మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని రేలంగి మామయ్య తరహాలో బాలాదిత్య ఉన్నాడంటూ కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. బాలాదిత్య మంచితనంను నటిస్తున్నాడని కొందరు అవహేళన చేస్తున్నారు.

ఈ సందర్భంగా బాలాదిత్య భార్య మరియు తండ్రి ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాలాదిత్య రియల్ గా ఎలా కనిపిస్తాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడంటూ బాలాదిత్య భార్య పేర్కొన్నారు. ఆయన మొదటి నుండి సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు, ఇప్పుడు అలాగే బిగ్‌ బాస్ లో కూడా ఉంటున్నారు.

బిగ్‌ బాస్‌ హౌస్ లో కొందరు తన భర్తకి వెన్ను పోటు పొడిచే విధంగా ఆడుతున్నారని.. కొన్ని టాస్క్ ల్లో ఆయన్ను నమ్మిన వారే మోసం చేయడం కాస్త బాధ కలిగించిందంటూ బాలాదిత్య భార్య అన్నారు. తన భర్త తప్పకుండా టాప్‌ 5 లో ఉంటాడు అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేశారు.

 

బాలాదిత్య తండ్రి మాట్లాడుతూ తప్పకుండా మా వాడి యొక్క ఆటను జనాలు నచ్చుతారు.. మెచ్చుతారు. ప్రతి ఒక్కరి అభిమానంను దక్కించుకుని టాప్ 5 లో నిలుస్తాడు అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. చిన్నతనంలో ఎన్నో అవార్డులను దక్కించుకున్న బాలాదిత్య బిగ్‌ బాస్ లో కూడా తన ప్రతిభ కనబర్చుతాడని చెప్పుకొచ్చాడు.

బాలాదిత్య భార్య ఇటీవలే పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన వెంటనే బాలాదిత్య బిగ్ బాస్‌ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఫీలింగ్ కాస్త ఇబ్బందిగానే ఉందని ఆయన భార్య ఎమోషనల్‌ అయ్యింది. బాలాదిత్య టాప్‌ లో ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.