Ali Reza: తండ్రి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..వెల్లువ‌లా కురుస్తున్న శుభాకాంక్ష‌లు

Ali Reza: బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్స్‌లో అలీ రెజా ఒక‌రు. సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అనే మరో మూవీలో​ చేస్తున్నట్లు ప్రకటించాడు.

Biggboss Ali Reza Announced that he is going to become a father soon
Biggboss Ali Reza Announced that he is going to become a father soon

ఈ మ‌ధ్య నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు అలీ.ఈ చిత్రం పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. అలానే ఆయ‌న‌కు మంచి పేరు కూడా తీసుకురాలేదు. మంచి సక్సెస్ కోసం అలీ రెజా ప్రయత్నిస్తున్నారు. అలీ రెజా ప్రస్తుతం ఆహ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు. అది బాగానే వైరల్ అయింది.


ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అలీ రెజా త‌న భార్య‌తో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంటారు. రీసెంట్‌గా తన భార్యను నడి రోడ్డు మీద ముద్దుల్లో ముంచెత్తారు. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.బిగ్ బాస్ ఇంట్లోకి అలీ రెజా కోసం మసూమ రావడంతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. అలా అప్పటి నుంచి ఆమె కూడా సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీగా మారిపోయారు. శివజ్యోతి, హిమజ, రోహిణి వంటి వారితో కలిసి మసూమ బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ, యాంకర్ రవి వంటివారితోనూ అలీ రెజా పార్టీలు చేసుకుంటూ ఉంటారు.


ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.