Biggboss 5: బిగ్ బాస్ సీజన్ 5లో మంగళవారం కూడా నామినేషన్ రచ్చ సాగింది.

Biggboss 5: ముందు జెస్సీ.. మానస్‌, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ కోపం కట్టలు తెచ్చుకుంది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్‌ చేశావని అన్నాడు. షణ్ముఖ్‌.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను; కాజల్‌.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్‌ మాస్టర్‌, ప్రియను నామినేట్‌ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్‌, శ్రీరామ్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Biggboss 5 Nominations heat extended to Tuesday
Biggboss 5 Nominations heat extended to Tuesday

‘యాంకరింగ్‌ కోసం లహరి ట్రై చేస్తుంది, అందుకని నాతో ఉంటుంది. కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట’ అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది లహరి.
Biggboss 5 Nominations heat extended to Tuesday
Biggboss 5 Nominations heat extended to Tuesday

‘నేను యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు. తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?’ అని నిలదీసింది. దీనికి రవి కాదని చెప్పాడు. కానీ ప్రియ మాత్రం.. ‘లహరి సింగిల్‌గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది, నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు’ అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది.
Biggboss 5 Nominations heat extended to Tuesday
Biggboss 5 Nominations heat extended to Tuesday

లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని లోబో.. కాజల్, సిరి దగ్గర తెలియజేసింది. ‘నిన్న హాఫ్‌ ఫిట్‌ డ్రెస్‌ వేసుకున్నాను. అది కొంచెం అన్‌ కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్‌ చేసుకుంటూనే ఉన్నాను. అయితే నన్ను సైగలు చేస్తూ ఏదో చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్‌ నేను చేసుకుంటున్నాను.

అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్‌ మార్చేసుకున్నాను’ అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్‌.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది.

అందరు తనని టార్గెట్ చేయడంతో చాలా బాధపడింది ప్రియ. ‘నువ్వేదైతే నేర్పించావో అలాగే ఉన్నానమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు’ అంటూ తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది.

తర్వాత బిగ్‌బాస్‌.. హౌస్‌మేట్స్‌కు ‘హైదరాబాద్‌ అమ్మాయి – అమెరికా అబ్బాయి’ టాస్క్‌ ఇచ్చాడు. హైదరాబాద్‌ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది.

అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్‌ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్‌ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా, విశ్వ అబ్బాయి పర్సనల్‌ అసిస్టెంట్‌గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్‌ మ్యారేజ్‌ బ్రోకర్‌గా, లోబో ఈవెంట్‌ మేనేజర్‌, శ్వేత లోబో అసిస్టెంట్‌, హమీదా.. అబ్బాయి ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్‌, మానస్‌ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్‌ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు.