Biggboss 5: బిగ్ బాస్ హౌజ్ చూపించిన నాగ్.. ట‌న్నుల కొద్ది కిక్ ఖాయ‌మ‌ట‌..!

Biggboss 5: బిగ్ బాస్ వ‌ల‌న ఎంత ఉప‌యోగం ఉందో తెలియ‌దు కాని, ఈ షో గురించి ఎంతో మంది కొన్నాళ్లుగా కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.ఇప్ప‌టికే సీజ‌న్ 5 లాంచింగ్ షోకి సంబంధించిన షూట్ పూర్తి కాగా, ఈ రోజు సాయంత్రం ఆరుగంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. అయితే ఈ గ్రాండ్ లాంఛ్‌కి సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

Biggboss 5 House Looks has been Released
Biggboss 5 House Looks has been Released

‘ఇక్కడ కిక్ టన్నుల కొద్దీ వస్తోంది’ అంటూ హోస్ట్ నాగార్జున మంచి కిక్ ఇవ్వగా.. ఆయన ఎంట్రీ ఎలివేషన్స్‌తో పాటు.. స్పెషల్ పెర్ఫామెన్స్‌లను చూపించారు. అయితే ఓ అందాల బ్యూటీ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్టుగా ప్రోమోలో హింట్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తూ.. స్వయంగా నాగార్జున హౌస్‌లోకి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5 హౌస్‌ని చూపించారు.


ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని తెలుపుతూ వదిలిన తాజా ప్రోమోలో నాగ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. సెట్ మొత్తం ఈ సారి గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండ‌నున్నట్టు తెలుస్తుంది. ఇక హౌజ్‌లో పాల్గొన‌బోయే వారికి సంబంధించి లిస్ట్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో ఫైన‌ల్‌గా ఉండే వారెవ‌ర‌నే దానిపై సందిగ్ధం నెలకొంది.


తాజా స‌మాచారం మేర‌కు క్రింద ఉన్న పేర్ల‌కి సంబంధించిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1. యాంకర్ రవి
2. షణ్ముఖ్ జస్వంత్
3. వీజే సన్నీ
4. మానస్ నాగులపల్లి
5. కార్తీకదీపం ఉమాదేవి (భాగ్య)
6. ఆర్జే కాజల్
7. శైలజా ప్రియ
8. శ్రీరామ్ చంద్ర
9. సరయు రాయ్
10. ఆనీ మాస్టర్
11. నటరాజ్ మాస్టర్
12. శ్వేతా వర్మ
13. లహరి

14. లోబో
15. సిరి హన్మంత్
16. జబర్దస్త్ ప్రియాంక (సాయి తేజ)
17. విశ్వ