Sarayu: బూతుల కంటెస్టెంట్ వారం రోజుల‌కు ఎంత రెమ్యున‌రేషన్ అందుకుందో తెలుసా?

Sarayu: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా లాంచ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ షోలో 19మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా ఇందులో బూతుల కంటెస్టెంట్‌గా స‌ర‌యూకి ఆద‌ర‌ణ బాగా ద‌క్కింది. స్టేజ్ పైనే బూతుల పురాణం విప్పిన స‌ర‌యూ హౌజ్‌లోకి వెళ్లాక మాత్రం కామ్‌గా ఉండిపోయింది.

Bigg Boss5 Sarayu Remuneration
Bigg Boss5 Sarayu Remuneration

అయితే నాగార్జున నువ్వు నువ్వుగానే ఉండు. బూతులు మాట్లాడు అని ఎంక‌రేజ్. త‌న బూతుల చిట్టా విప్పుదామ‌నుకునే క్ర‌మంలో స‌ర‌యు ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వంద రోజులు కచ్చితంగా ఉంటానని చెప్పడంతో, లోప‌ల అంద‌రిని వ‌ణికిస్తాన‌ని చెప్పిన ఈ హాట్ భామ సరయు తొలివారమే బిగ్ బాస్ హౌస్ ను వీడాల్సి వచ్చింది.

నామినేషన్‌లో ఉన్న హమీదాకు సరయూ కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమెను లవ్‌ ట్రాకుల కోసం షోలో ఉంచారని, సరయూను బలి చేశారని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక స‌ర‌యు దారుణ‌మైన కామెంట్స్ చేసింది. ఇంకా ముసుగులు వేసుకునే చాలా మంది ఆడుతున్నారని చెప్పింది.

షణ్ముఖ్‌, సరయూ.. బయటే అంతా ఫిక్స్‌ చేసుకుని హౌస్‌లో అడుగుపెట్టారని ఆరోపించింది. సిరి మగాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతుందని, వీజే సన్నీ తన మీద పగ పెంచుకున్నాడంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద నుండే చెప్పింది. ఇక అరియానా హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ‌జ్ షోలో అంద‌రిపై విరుచుకు ప‌డింది.

అయితే సోషల్‌ మీడియాలో సరయూ పారితోషికం గురించి కూడా ఓ వార్త వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం.. బిగ్‌బాస్‌ ఆమెకు 70 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ముట్టజెప్పాడని సమాచారం. వారం రోజులకు గానూ ఈ మొత్తాన్ని సరయూకు అందించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ కంటెస్టెంట్స్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో.. నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావ్.. నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ సరయుని బాగానే ఆడుకుంటున్నారు.