బిగ్‌బాస్4: ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఈ వారం బిగ్ బాస్ హౌజ్ గడప దాటనుంది ఎవరంటే..?
Samsthi 2210 - December 6, 2020 / 03:24 PM IST

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తుది దశకు చేరుతున్న నేపథ్యంలో అనేక ట్విస్ట్‌లు ప్రేక్షకులని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో, ఎప్పుడు ఏం టాస్క్ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లేదని చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున ఈ వారం ఒకరిని ఇంటి నుండి పంపనున్నారు. అయితే ప్రస్తుతం హౌజ్‌లో అఖిల్, అవినాష్, అరియానా, అభిజిత్, సోహైల్, మోనాల్, హారిక ఉన్నారు. వీరిలో అఖిల్, సోహైల్, అరియానా సేఫ్ జోన్‌లో ఉన్నారు. మోనాల్, హారిక, అభిజీత్, అవినాష్ నామినేషన్‌లో ఉన్నారు. లీకుల సమాచారాన్ని బట్టి మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని శనివారం రోజు రచ్చ చేశారు.
కాని అనూహ్యంగా మోనాల్ సేవ్ అయ్యిందని.. ముక్కు అవినాష్ ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో తప్పులని సరి చేసుకొని షేర్ చేయడం మొదలు పెట్టారు. మోనాల్ బిగ్ బాస్ దత్త పుత్రిక కాగా, ఆమెను ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ ఆసక్తి చూపడం లేదుంటూ పుకార్లు వినిపిస్తూనే వాటిపై నిర్వాహకులు అంతగా దృష్టిపెట్టడం లేదని తెలుస్తుంది. అయితే అవినాష్ ఎలిమినేట్ అవడానికి కారణాలు లేకపోలేదు. సింపథీ గేమ్ ఆడడం, చిన్నా చితకా విషయాలకు సీరియస్ కావడం, ఎప్పుడు ఏదో భయంలో ఉండడం ప్రేక్షకులకు చాలా విసుగు తెప్పించాయి.
కొద్ది వారాలుగా అవినాష్ ప్రవర్తన చాలా చిరాకు తెప్పించిన నేపథ్యంలోనే అతనిని ఎలిమినేట్ చేసి ఉంటారనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే అవినాష్ ఎలిమినేట్ అయితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, అరియానా స్పందన ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎలిమినేట్ అయితే చావే నాకు శరణ్యం అన్నట్టు మాట్లాడాడు. మరి ఈ రోజు నిజంగా ఎలిమినేట్ అయితే అవినాష్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.