బిగ్ బాస్ సీజన్ 4లో ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌజ్‌లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు తర్వాతి రెండు వారాలలో బయటకు వెళ్ళనుండగా, చివరి వారం ఐదుగురు ఉంటారు. ఈ ఐదుగురిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. నిన్న ఎవిక్షన్ పాస్‌తో ఎలిమినేషన్ లేకుండా బిగ్ బాస్ ఈ వారం ఒకరిని ఇంటి నుండి బయటకు పంపేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికీ కొన్ని రంగులను ఇచ్చి.. ఎవర్ని అయితే నామినేట్ చేయాలనుకున్నారో ఆ రంగును నామినేట్ చేయాలనుకుంటున్న వారి సీసాలో పోయమని చెప్పాడు బిగ్ బాస్.
తాజాగా నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో అఖిల్‌ని మోనాల్ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగినట్టు అర్దమవుతుంది. మరోవైపు హారిక..అభిజీత్ని నామినేట్ చేసింది. ఇక బుర్ర పెట్టి ఆడు గేమ్ అని అఖిల్ అంటే హార్ట్ తో ఆడతానంటూ సమాధానమిచ్చింది మోనాల్. ఇక అరియానాని మోనాల్ నామినేట్ చేయగా, ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. మోనాల్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే మధ్యలో దూరిన అవినాష్.. తెలుగులో మాట్లాడమని చెప్పాడు
అవినాష్ ఉచిత సలహాతో మోనాల్‌కు చిర్రెత్తిపోయింది. మధ్యలో మాట్లాడకు అంటూ అతనిపై శివాలెత్తింది. ఇక అఖిల్.. అవినాష్ మధ్య కొంత చర్చ జరిగింది. ఈ ఇంట్లో నా కంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నపుడు నేనేందుకు ఎలిమినేట్ కావాలని చెప్పాడు అవినాష్. అది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటూ అఖిల్ సీరియస్ అయ్యాడు. నామినేషన్ అంటే బిగ్ బాస్ హౌజ్ వాడివేడిగా మారుతుండడం ఖాయం. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే మరో సారి బిగ్ బాస్ హౌజ్‌లో రచ్చ ఖాయంగా కనిపిస్తుంది.
Nomination process started…Everybody can talk here!!!#BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/XifRjFyscV
— starmaa (@StarMaa) November 30, 2020