బిగ్ బాస్4: నేను ఓటు వేశాను, మ‌రి మీరు? … ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న హిమ‌జ‌

Samsthi 2210 - November 24, 2020 / 09:57 AM IST

బిగ్ బాస్4: నేను ఓటు వేశాను, మ‌రి మీరు? … ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న హిమ‌జ‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 చివరి ద‌శ‌కు వ‌చ్చేసింది. 11 వారాలు స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో సోమ‌వారం 12వ వారంలోకి అడుగుపెట్టింది. హౌజ్‌మేట్స్ అంద‌రు చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు కామ్‌గా ఉన్న మోనాల్ నిన్న జ‌రిగిన నామినేష‌న్‌లో త‌న జూలు విదిల్చింది. అఖిల్‌ని సైతం ప‌క్క‌న ప‌డేసి త‌న గేమ్ తాను ఆడుతుంది. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రుంటారు, ఎప్పుడు ఎవ‌రుంటారు అనేది చెప్ప‌డం ఇప్పుడు అంతా సస్పెన్స్‌గా మారింది. అయితే నెటిజ‌న్స్ మాత్రం త‌మ ఫేవ‌రేట్ కంటెస్టెంట్స్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ వారే విజేత‌లుగా నిలుస్తున్నార‌ని జోస్యాలు చెబుతున్నారు.

himajaa

బిగ్ బాస్ సీజ‌న్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న హిమ‌జ నాలుగో సీజ‌న్‌ని బాగానే ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫిమేల్ కంటెస్టెంట్స్ అయినటువంటి మోనాల్‌, అరియానాల‌కు వోట్ వేయాల‌ని చెబుతుంది. అప్పుడే అయింద‌నుకోకు, ఇప్పుడే మొద‌లైంది అంటూ మోనాల్ ఫోటో, అరియానా ఫోటో షేర్ చేస్తూ ఆమెను స‌పోర్ట్ చేయాలంటూ హిమ‌జ పోస్ట్ పెట్టింది. నేను ఈ ఇద్ద‌రికి ఓట్ వేసాను. మీరు కూడా త‌ప్ప‌క వేయండి అని పేర్కొంది హిమ‌జ. ఇటీవ‌ల 31వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన హిమ‌జ త‌న బ‌ర్త్‌డేని స్నేహితుల మ‌ధ్య స‌రదాగా జ‌రుపుకుంది. ర‌వికృష్ణ‌, శివ‌జ్యోతి, యాంకర్ ప్ర‌శాంతి ఈ అమ్మ‌డి చేత కేక్ క‌ట్ చేయించి సెల‌బ్రేష‌న్స్‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

రీసెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిల ఎక్స్‌పోజింగ్‌పై కూడా మాట్లాడింది. ఎక్స్‌పోజింగ్ చేయ‌మ‌ని ఎవ‌రు మ‌న‌కు చెప్పరు. ఇది మ‌న సొంత నిర్ణ‌యం. కావ‌ల‌సిన దుస్తులు వేసుకోవ‌చ్చు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లుంటారు. వాళ్లకు లేని ప్రాబ్ల‌మ్ మిగ‌తా వాళ్ల‌కు ఎందుకో అంటూ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది హిమ‌జ‌. ఇక సీజ‌న్ 4లో సోమ‌వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే మోనాల్‌, అవినాష్‌, అరియానా, అఖిల్‌లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Himaja💫 (@itshimaja)

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us