BIGG BOSS: యూకేకు మకాం మారుస్తున్న బిగ్ బాస్ విన్న‌ర్.. కార‌ణం ఏంటో తెలుసా?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ కార్య‌క్ర‌మం ఎంత స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. సీజ‌న్ 1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2ని నాని, సీజ‌న్ 3,4ల‌ను నాగార్జున న‌డిపించారు. అయితే సీజ‌న్ 2లో కౌశ‌ల్ బిగ్ బాస్ కిరీటాన్ని అందుకోగా, దాని కోసం ఆయ‌న హౌజ్‌లో ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్ర‌తి ఒక్క‌రు కౌశ‌ల్‌ని టార్గెట్ చేసిన ఆయ‌న ఏ మాత్రం కుంగిపోకుండా ధైర్యంగా ఆడి గేమ్ గెలిచాడు. కౌశ‌ల్‌పై ఎన్నో నిందలు కూడా వేశారు. వాటిని భ‌రించాడు. అత‌ని పేష‌న్స్ చూసి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చివ‌రికి అత‌నినే బిగ్ బాస్ సీజ‌న్ 2 విన్న‌ర్‌గా ప్ర‌క‌టించారు.

బిగ్ బాస్ విన్న‌ర్ అయిన త‌ర్వాత కౌశ‌ల్ కెరీర్‌లో ఎలాంటి మార్పు లేదు. అలానే ఫ్యాష‌న్ డిజైన్,యూట్యూబ్ ఛానెల్ వంటివి చూసుకుంటూ కాలం గ‌డుపుతున్నాడు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న తెలుగు రాష్ట్రాల‌లో ప‌రిస్థితులు మార‌డంతో కౌశ‌ల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో త‌న ఆఫీస్ మూసేసిన‌ట్టు స్వ‌యంగా చెప్పిన కౌశ‌ల్ త్వ‌ర‌లోనే హైదరాబాద్ నుండి లండన్ కు మకాం మార్చే ఆలోచనలో ఉన్నట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో మోడ‌లింగ్‌, సినిమాల‌కు స్కోప్ లేక‌పోవ‌డంతో లండ‌న్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

కౌశ‌ల్ భార్య ప్ర‌స్తుతం యూకేలో అకాడమిక్ కోర్స్ చేస్తున్నట్లు తెలిపాడు కౌశ‌ల్. అందుకే తాను కూడా త్వరలోనే అక్కడికి వెళ్లనున్నాడట. కౌశల్ యూకేలో ఎందుకు సెటిల్ అవ్వాలని అనుకున్నాడో కారణం తెలియలేదు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫీచర్ ఫిల్మ్ అని మాత్రం చెప్పుకొచ్చాడు. మరి త‌న డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకునేందుకు లండ‌న్ వెళుతున్న కౌశ‌ల్ పూర్తిగా అక్క‌డే సెటిల్ అవుతాడా, లేదంటే కొద్ది రోజుల త‌ర్వాత తిరిగి వ‌స్తాడా అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్. అభిమానులు మాత్రం కౌశ‌ల్ తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారు.

Advertisement