Kaushal Manda: క‌రోనాతో చాలా ఇబ్బందులు ప‌డ్డ కౌశ‌ల్ భార్య‌.. ప‌రిస్థితుల‌ని వివ‌రించిన నీలిమ‌

Kaushal Manda క‌రోనా మ‌హమ్మారి గత ఏడాది ఉదృతంగా ఉన్న‌ప్ప‌టికీ సెల‌బ్రిటీల‌పై ఎక్కువ‌గా ఎఫెక్ట్ చూపించ‌లేదు. కాని సెకండ్ వేవ్‌లో మాత్రం సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు సైతం వ‌ణుకు పుట్టిస్తుంది. క‌రోనాతో ఎంద‌రో క‌న్నుమూయ‌గా, చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డ్డారు. బిగ్ బాస్ సీజ‌న్ 2 విన్న‌ర్ కౌశ‌ల్ భార్య నీలిమకు కూడా క‌రోనా సోక‌డంతో ఆమె చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా తెలియ‌జేసింది.

బిగ్ బాస్ ఫేం కౌశ‌ల్ ఇటీవ‌ల త‌న భార్య ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందిన విష‌యం తెలిసిందే. ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ అని త‌న కామెంట్ సెక్ష‌న్‌లో పేర్కొన్నారు. కౌశ‌ల్ కామెంట్స్‌తో ఆయ‌న అభిమానుల‌లో క‌ల‌వ‌రం మొదలైంది. అన్నా, వ‌దిన‌కు ఏం జ‌రిగిందంటూ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. తాజాగా నీలిమ‌ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేసింది.

హాయ్.. అందరూ ఎలా ఉన్నారు. మీకందరికీ తెలియనిది ఏంటంటే.. నాకు కోవిడ్ వచ్చింది. ఏడు రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్నా. నేను ఇప్పుడు యూకేలో ఉన్నాను. వర్క్ చేస్తున్న ప్లేస్‌లో వేరే వాళ్లకి ఉండటం వల్ల నాకూ సోకింది. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే.. ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు కదా.. అక్కడి కంటే కూడా యూకేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కేసులు తక్కువే కానీ.. ఒక్కసారి అటాక్ అయిన తరువాత ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందనే దాన్ని చెప్పాలనుకున్నా.

క‌రోనా వ‌చ్చాక బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది.. చెస్ట్ మొత్తం పెయిన్.. ఆయాసం ఎక్కువగా వచ్చేసేది. ఆ టైంలో నేను ఎన్ హెచ్ ఎస్ వాళ్లకి చెప్పాను. నాకు ప్రాబ్లమ్‌గా ఉంది చూడండి అని. కానీ వాళ్లు పారాసిటిమాల్ ప్రతి ఆరు గంటలకి ఒకసారి చొప్పున 1000 ఎంజీ వాడండి అని మాత్రమే చెప్పారు తప్పితే ఎలాంటి వైద్యం చేయ‌లేదు. నేను చాలా గొప్ప‌గా ఊహించుకున్నా. ఇండియా క‌న్నా ఇక్క‌డ ప‌రిస్థితి దారుణం. మ‌న ద‌గ్గ‌ర మంచి మంచి డాక్టర్లు ఉన్నారు.. ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇక్కడ లేరని కాదు కానీ.. సిస్టమ్ ఫాలో అవ్వమంటున్నారు. మెడిసిన్ ఇవ్వడం లేదు.. కోవిడ్‌కి అయితే పారాసిటిమల్ మాత్రమే ఇస్తున్నారు. అది తప్ప ఇంకేం లేదు.

ఇప్పుడు నాకు వైరస్ వచ్చి ఏడోరోజు. ప్ర‌స్తుతం నాకు బాగానే ఉంది.. ఆయాసం తగ్గింది.. నెగిటివ్ రాగానే ఇంటికి రావాలనిపిస్తుంది. నా పిల్లల్ని చూడాలనిపిస్తుంది.. అందుకే ఇండియా వస్తా. యూకేలో కోవిడ్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మీతో పంచుకోవాలనిపించింది. అందరూ ధైర్యంగా ఉండండి’ అని తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చింది నీలిమ‌.