Bigg Boss : ప్రశాంత్ అరెస్ట్ తో సంచలన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్.. ఇకపై రద్దు..!

NQ Staff - December 26, 2023 / 12:26 PM IST

Bigg Boss : ప్రశాంత్ అరెస్ట్ తో సంచలన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్.. ఇకపై రద్దు..!

Bigg Boss :

బిగ్ బాస్ సీజన్-7 ఎంత సక్సెస్ అయితో అంతే వివాదాలు కూడా రేపింది. ఈ సీజన్ మొత్తం చూసుకుంటే గత రెండు సీజన్ల కంటే చాలా పెద్ద హిట్ అయింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఆ ఆనందం యాజమాన్యానికి ఎక్కువ సేపు ఉండలేదు. ఎందుకంటే ఫినాలే ఎపిసోడ్ అయిపోగానే విన్నర్ పల్లవి ప్రశాంత్ అను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫినాలే రోజున పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా బిగ్ బాస్ హౌస్ కు చేరుకున్నారు. పోలీసులు వద్దని చెప్పినా సరే వినకుండా ప్రశాంత్ భారీ ర్యాలీ చేశారు. ఆ సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు.

వారి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా బస్సులను కూడా ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు దాడి చేసిన వారిపై, ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. మొన్న ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రశాంత్. దాంతో బిగ్ బాస్ మీద తీవ్రమైన వ్యతిరేతక వచ్చింది. ఆ షో రెప్యుటేషన్ దెబ్బ తీసింది. ఈ షో రద్దు చేయాలన్న వాదనలకు బలం చేకూర్చింది. బిగ్ బాస్ వల్లనే ఇదంతా జరుగుతోందని.. దాంతో అసలు ఉపయోగమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు చాలామంది. దాంతో ఇప్పుడు చేసేది లేక బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు.

కాగా ఇక నుంచి బిగ్ బాస్ ఫినాలే రోజున ర్యాలీలకు అనుమతి లేకుండా చూడాలని చూస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ కు వచ్చే కంటెస్టెంట్లతో ముందే ఈ విషయాన్ని మాట్లాడుకోవాలని చూస్తున్నారు. దీనిపై ఒప్పందం రాయించుకున్న తర్వాతనే వారికి కఠినమైన రూల్స్ ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఇక నుంచి ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలన్నది వారి ప్లాన్ అని తెలుస్తోంది. ఎలిమినేట్ అయిన వారు కూడా ఎలాంటి ర్యాలీలు చేయడానికి వీల్లేదని.. అలా చేయడం ద్వారా ఇలా గొడవలు జరుగుతున్నాయని వారు భావిస్తున్నారు.

మరీ ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఎలాంటి గొడవలు, ర్యాలీలు జరగకుండా చూడాలన్నది వారి ప్లాన్ అని తెలుస్తోంది. అలా చేయడం వల్ల అన్నపూర్ణ స్డూటియోకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందన్నది వారి ఆవేదన అని తెలుస్తోంది. ఇప్పుడు తర్వాత వచ్చే సీజన్ నుంచే ఈ రూల్స్ అమలు చేయాలని భావిస్తున్నారు.

పోలీసులు కూడా ప్రతి ఎపిసోడ్ సమయంలో అదే కోరుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో రోడ్లపై భారీ ర్యాలీల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ ప్రేక్షకులకు కొంత నిరాశే అని చెప్పుకోవాలి. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us