Bigg boss: బిగ్ బాస్ హౌజ్‌లోకి ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ‌చ్చే స‌మ‌యం ఆసన్న‌మైంది..!

Bigg boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం 12వ వారం ఆస‌క్తిగా న‌డుస్తుంది. షో నుండి ఒక‌రు బ‌య‌ట‌కు వెళ్ల‌నుండ‌గా,ఏడుగురు మాత్ర‌మే హౌజ్‌లో ఉండ‌నున్నారు. షో చివ‌రి ద‌శ‌లో హౌస్‌మేట్స్‌కు తమ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్.

bigg-boss-5-to-welcome-family-member inside
bigg-boss-5-to-welcome-family-member inside

కోవిడ్ వ‌ల‌న గ‌తంలో మాదిరిగా వారిని క‌లిసి ప‌ట్టుకొని మాట్లాడ‌లేక‌పోయిన గ్లాస్ ఛాంబ‌ర్‌లో ఉండి మాత్రం వారి పిల్ల‌ల‌ల‌ను చూసే అవ‌కాశం మాత్రం ఇచ్చారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే, మాజీబిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా, VJ సన్నీ తల్లి, ప్రియాంక సింగ్ తండ్రి మరియు మానస్ తండ్రి రాబోయే వారంలో అతిథులుగా కనిపించనున్నారు.

వారు గ్లాస్ ఛాంబర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తారో లేదా వేదికపై నుండి హోస్ట్ నాగార్జున అక్కినేనిని పలకరిస్తార‌నే దానిపై క్లారిటీ లేదు. కుటుంబ సభ్యుల ఎపిసోడ్ ప్రతి సీజన్‌లాగే ఎమోషనల్‌గా సాగుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 12వ వారంలోకి ప్రవేశించింది మరియు సిరి, షన్ను, ప్రియాంక, శ్రీరామ చంద్ర, కాజల్, సన్నీ మరియు రవి 12వ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.

bigg-boss-5-to-welcome-family-member inside
bigg-boss-5-to-welcome-family-member inside

ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ప్రియాంక‌ వీక్ కంటెస్టెంట్ . ఆట పరంగా కూడా ప్రియాంక అంతగా ఆకట్టుకోవడం లేదు. పైగా ఓట్లు కూడా తక్కువగానే పడుతున్నాయి. దాంతో ఈ వారం ఇంటి నుంచి ప్రియాంక బయటికి రావడం దాదాపు ఖాయం అయిపోయింది.