Bigg Boss Telugu5: సిరి ష‌ర్ట్‌లో చేయి పెట్టిన స‌న్నీ.. క‌ళ్లు తిరిగి ప‌డిపోయిన లోబో

Bigg Boss Telugu5: బిగ్ బాస్ సీజ‌న్ 5 రోజురోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ గేమ్‌లో కొట్టుకోవ‌డాలు, తిట్టుకోవ‌డాలు,త‌న్ను కోవ‌డాలు, ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డాలు కామ‌న్‌గా మారాయి. సీజ‌న్ 5 అయితే మొద‌టి నుండి రచ్చ‌గానే సాగుతుంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో అయితే హౌజ్‌మేట్స్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది.

Bigg Boss telugu5 Latest Episode Highlights
Bigg Boss telugu5 Latest Episode Highlights

న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌ని గుంట న‌క్క అన్న ర‌వి ఆ విష‌యంపై అత‌నితో డిస్క‌స్ చేశాడు. ఎందుకు అంతా అలా ఊహించుకుంటున్నారు మాస్టర్?’ అని రవి అనడంతో.. ‘నేనేం ఊహించుకోవడం లేదు.. నామినేషన్ ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు అని మాస్ట‌ర్ అన్నాడు. మీరు దేవుడిలా మాట్లాడితే.. ఇంకేం చెయ్యాలి మాస్టర్.. మీరు దేవుడు.. మీరు తోపు, తురుము నాకు తెలుసు.. ప్రూఫ్ ఉంది కదా మీకు నేనే ఎక్కిస్తున్నాను అని? నాతో చక్కగా మాట్లాడరెందుకు మాస్టర్ అంటూ అత‌నితో కొంత సేపు డిస్క‌స్ చేశాడు.

Bigg Boss telugu5 Latest Episode Highlights
Bigg Boss telugu5 Latest Episode Highlights

ఇక ప్రియాతో శ్వేత.. ‘ఉమాగారు అలా ఎలా మాట్లాడతారు.. ఆ లాగ్వేజ్ ఏంటీ? అంటూ తిట్టిపోసింది. రవి, సిరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే.. సిరి రవితో.. ‘నటరాజ్ మాస్టర్ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది.. గుంటనక్కా అంటారు? ఏంటేంటో అంటారు? అసలు ఏంటి ఆయనా? ఆయన ప్రవర్తన ఏంటీ? నాకు అస్సలు నచ్చలేదు’ అని చెప్పుకొచ్చింది.

మరునాడు ఉదయాన్నే ‘ముక్కాలా ముక్కాబులా’ సాంగ్‌కి హౌజ్‌మేట్స్ త‌మ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. శ్వేత ఏడుస్తూనే సన్నీకి గుడ్ మార్నింగ్ చెబుతుంది. ఇక ప్రియాకు విజిల్ వేస్తాడు లోబో. దాంతో బుద్ధి లేదా అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఇలానే విజిల్స్ వేస్తారా? అంటూ తిడుతుంది. దీంతో కొద్ది సేపు అక్క‌డ న‌వ్వులు విరిసాయి.

Bigg Boss telugu5 Latest Episode Highlights
Bigg Boss telugu5 Latest Episode Highlights

ఇక స‌న్నీ.. ఉమోదేవి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప్రేమ‌గా మాట్లాడ‌మ‌ని చెబితే నేను ఇంతే ఉంటాన‌ని మొహం మీదే చెప్పేసింది. నా చెల్లి,మొగుడితో కూడా ఇలానే ఉంటాన‌ని పేర్కొంది.ఇక కెఫ్టెన్ పోటీదారుల టాస్క్.. పంతం నీదా నాదీ.. అనే పేరుతో గేమ్ స్టార్ట్ అయ్యింది. మొదటి టాస్క్ ‘దొంగలున్నారు జాగ్రత్త’.. టాస్క్‌లో భాగంగా పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేస్తుంది.

సిరీ మాట‌ల‌కు తాను అలా చేయ‌లేద‌ని చెబుతాడు. ఈ విష‌యంలో పెద్ద గొడ‌వే అయింది. ఇక టాస్క్‌లో బాగంగా లోబోకి క‌ళ్లు తిరిగి కుప్ప‌కూల‌డంతో వెంట‌నే మెడికల్‌ రూమ్‌కి తరలించారు. నక్క టీమ్‌ సభ్యుల నుంచి పిల్లోస్‌ లాక్కునేందకు శ్రీరామచంద్ర ప్రయత్నించడంతో… రవి ఫైర్‌ అయ్యాడు. రోబోకి అలా ఉంటే.. ఇప్పుడు కూడా గేమ్‌ అడుతారా ‘ఛీ’అంటూ గట్టిగా అరిచాడు. దీంతో గద్ద టీమ్‌ సభ్యుడైన విశ్వ.. మాటలు మంచిగా రానివ్వంటూ రవిపై అరిచాడు.

కొద్ది సేప‌టి త‌ర్వాత ర‌వి.. విశ్వ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సారీ చెప్పాడు. ఇక కెప్టెన్ పోటీదారులకు సంబంధించిన రెండో టాస్క్ ‘సాగరా సోదరా’ స్టార్ట్ అయ్యింది. ఇందులో ర‌చ్చ మరింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని తాజాగా విడుద‌లైన ప్రోమోని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.