Bigg Boss Telugu5: బిగ్ బాస్ హౌజ్‌లో లాక్‌డౌన్.. ఆ ముగ్గురికి మాత్ర‌మే ఇంట్లోకి ప్ర‌వేశం

Bigg Boss Telugu5: బిగ్ బాస్ ఎనిమిదో వారంలో నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా ఎమోష‌న‌ల్‌గా సాగ‌గా, కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్ చుక్క‌లు చూపిస్తుంది.విచిత్ర‌మైన టాస్క్‌ల‌తో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని నానా తిప్ప‌లు పెట్టాడు. అయితే మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మొద‌ట్లో బెడ్‌రూమ్‌ ఏరియాలో పింకీ, సిరి, మానస్‌ ముచ్చట్లు పెట్టారు.

TheNewsQube-
Bigg Boss Telugu5 Episode 52 Highlights
Bigg Boss Telugu5 Episode 52 Highlights

ఈ సారి నామినేషన్‌లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్‌ అడగ్గా.. అవును ఒక గర్ల్‌, ఐదుగురు బాయ్స్‌ ఉన్నారని సిరి చెప్పింది. నేను మానస్‌ టాప్‌ 5లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. ‘మేమేంటి అడుక్కోవాలా..?’ అని ప్రశ్నించించగా.. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులేని కౌంటర్‌ ఇచ్చింది పింకి.

Bigg Boss Telugu5 Episode 52 Highlights
Bigg Boss Telugu5 Episode 52 Highlights

అంకుల్స్‌ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్‌ కోరుకోగా.. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్‌ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్‌ ఇచ్చింది.ర‌వి,ష‌ణ్ముఖ్ మోజో రూమ్‌లో కొద్ది సేపు ముచ్చ‌టించ‌సాగారు. నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..’ అంటూ షన్ను పరువు తీశాడు రవి

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్‏డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు.

Bigg Boss Telugu5 Episode 52 Highlights
Bigg Boss Telugu5 Episode 52 Highlights

కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు ఐదు చాలెంజ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్‌. ఈ చాలెంజ్‌లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. మొద‌టి ఛాలెంజ్‌లో ష‌ణ్ముఖ్‌,లోబో పాల్గొన్నారు. ఈ చాలెంజ్‌లో భాగంగా గార్డెన్‌ ఏరియాలో బాత్‌టబ్‌లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉన్నాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే విజేతలు.

ఇందులో టాస్క్‌లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే షణ్ముఖ్‌ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా.. నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ.. షణ్ముఖ్‌ని విన్నర్‌గా ప్రకటించడంతో సిరి ఎగిరిగంతేసి షణ్ముఖ్‌ని గట్టిగా కౌగిలించుకుంది.

Bigg Boss Telugu5 Episode 52 Highlights
Bigg Boss Telugu5 Episode 52 Highlights

రెండో చాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్‌ ఫూల్‌ అడుగున​ ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్‌ రాడ్‌తో బయటకు తీయాలి. ఇందులో రవి, సిరి హోరా హోరిగా పోటీపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది.

మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే రోప్‌లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. దీని కోసం శ్రీరామ‌చంద్ర‌,మాన‌స్ పోటీ పడ్డారు. చెమ‌ట‌లు క‌క్కారు.చివ‌ర‌కు శ్రీరామ‌చంద్ర విజేతగా నిలిచాడు. మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ దారులుగా షణ్ముఖ్‌, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు.