Bigg Boss Telugu5: దీప్తిని చూసి బయపడుతున్న షణ్ముఖ్.. ఆ అర్హ‌త స‌న్నీకే ఉంద‌న్న ప్రియ‌

Bigg Boss Telugu5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో ఆదివారం ఎపిసోడ్ చాలా ర‌క్తి క‌ట్టించింది. 51వ రోజు కంటెస్టెంట్లతో నాగ్ ఆటలు ఆడించాడు. పాటలు పాడించాడు. మొత్తంగా సండే ఫండే అనేట్టు చేశాడు. గార్డెన్ ఏరియాలో పదకొండు పిల్లోస్ పెట్టాడు. కానీ ఇంట్లో ఉన్నది పదమూడు మంది. అంటే మొదటి రౌండ్‌లో ఇద్దరు పక్కకు తప్పుకుంటారన్న మాట.

TheNewsQube-
Bigg Boss Telugu5 Episode 50 Highlights
Bigg Boss Telugu5 Episode 50 Highlights

బజర్ మోగిన తరువాత పరిగెత్తి పిల్లోలను పట్టుకోవాలని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల దగ్గరి నుంచి బతిమిలాడి పిల్లోలను తీసుకోవచ్చు. లేదా లాక్కోవచ్చు. ఏదైనా చేయోచ్చు అని తెలిపాడు. మొద‌టి బ‌జ‌ర్‌కి కాజల్, షన్ను అవుట్ అయ్యారు. రెండో ఆటగా చలనచిత్ర వీర అంటూ ఆడించాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. పరిగెత్తి గంటను కొట్టి సమాధానాలు చెప్పాలి.

ఇంద్ర సినిమాలో చిరంజీవి పాత్రల పేర్లు సరిగ్గా చెప్పలేక జెస్సీ అవుట్ అయ్యాడు. 100 పర్సెంట్ లవ్ సినిమాలో తమన్నా కారెక్టర్ పేరు చెప్పలేక ప్రియ అవుట్ అయింది. అలా ఈ టాస్క్‌లో తప్పు సమాధానాలు చెప్పి మానస్, ప్రియాంక కూడా పక్కకు తప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ నీళ్లు కన్నీళ్లు అనే ఆట ఆడించాడు. ఇక నీళ్లు నింపే టాస్క్ చివరి సమయానికి రవి, లోబో అవుట్ అయ్యాడు.

Bigg Boss Telugu5 Episode 50 Highlights
Bigg Boss Telugu5 Episode 50 Highlights

ఆ తరువాత మిసెస్ ప్రభావతి దయతో లోబో సేఫ్ అయ్యాడు. లోబోకు మాత్రమే కోడి కూత రావడం, మిగతా కంటెస్టెంట్లకు రకరకాల జంతువలు శబ్దాలను ఇచ్చింది. మిగిలిన ఆనీ, విశ్వ, శ్రీరామ, సిరి, సన్నీలకు మ్యూజికల్ చైర్ ఆటనుపెట్టాడు. ఇందులో మొదటి పాటకే సిరి అవుట్ అయింది. రెండో సారికి సన్నీ పక్కకు జరిగిపోయాడు.

అలా చివరకు శ్రీరామచంద్ర, విశ్వ, ఆనీలు మిగిలారు. తాను ఓ కలర్ పేరు చెబుతాను.. ఇంట్లోంచి వెళ్లి ఆ కలర్ వస్తువులను పట్టుకుని రావాలని నాగ్ తెలిపాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర ఓడిపోయాడు. చివరకు ఆనీ, విశ్వలు మిగ‌ల‌గా, వీరి త‌ల‌పై టోపి ఎవ‌రికైతే ఉంటుందో వారు విజేత‌లుఅని చెప్పాడు. విశ్వ టోపీ ముందుగా పడటంతో ఆనీ మాస్టర్ చివరకు గెలిచింది.
.
ఆనీ మాస్టర్‌కు నాగార్జున ఓ పవర్ ఇచ్చాడు. కానీ ఆ పవర్ ఏంటో అన్నది బిగ్ బాస్ చెబుతాడని తెలిపాడు. ఆ తరువాత బొమ్మల ద్వారా రవి, ఫ్రూట్స్ ద్వారా సిరి, బెలూన్ ద్వారా జెస్సీ సేఫ్ అయినట్టు ప్రకటించాడు. చివరకు మిగిలిన ఆనీ, ప్రియ ఎలిమినేషన్స్‌లో ట్విస్ట్ పెట్టాడు. చివ‌కు ప్రియ ఎలిమినేట్ అయి అనీ మాస్ట‌ర్ తిరిగి వ‌చ్చేసింది.

Bigg Boss Telugu5 Episode 50 Highlights
Bigg Boss Telugu5 Episode 50 Highlights

బిగ్ బాస్ జ‌ర్నీ చూశాక‌, ఎక్క‌డ ఉన్నాత‌ను బ‌తికేస్తాన‌ని చెప్పింది. ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఇస్తావో.. ఎందుకు ఇచ్చావో కూడా చెప్పమని ప్రియకు టాస్క్ ఇచ్చాడు నాగ్. అందులో భాగంగా లోబోకు ఐదు మార్కులు ఇచ్చింది. విశ్వకు ఐదు మార్కులు ఇచ్చింది. రవికి ఏడు మార్కులు ఇచ్చింది. చాలా మంచి వాడు. ఇక నిన్ను సిల్లీ కారణాలతో నామినేట్ చేసేవారు ఉండరు అని ప్రియ నవ్వించే ప్రయత్నం చేసింది.

సిరి, షన్నులకు ఎనిమిదన్నర ఇచ్చింది. మీ ముగ్గురు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండండి. షన్ను చాలా మంచి వాడు. ప్రతీ ఒక్కరికీ అలాంటి ఫ్రెండ్ ఉండాలి. సిరి చాలా మంచిది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. టాస్కులు బాగా ఆడుతుంది. అని చెప్పుకొచ్చింది. శ్రీరామచంద్రకు ఎనిమిది మార్కులు ఇచ్చింది. ఎక్కువగా ర్యాపో లేదు. అంతగా కలవలేదు. కానీ తన మూడ్ బాగుంటే మాత్రం అందరినీ నవ్విస్తాడు.

ప్రియాంకకు పది మార్కులకు వంద మార్కులు ఇచ్చింది. చాలా మంచిది. పొద్దున లేవగానే ఆమె మొహమే చూస్తాను. ఆమె మొహం చూడని రోజు నాకు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పుకొచ్చింది. ఆనీ మాస్టర్‌కు కూడా పది మార్కులు ఇచ్చింది. చాలా చూసి వచ్చింది. ఆమె కోపం పది పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మళ్లీ సైలెంట్ అవుతుంది. అందరినీ క్షమించేస్తుంటుంది. జెస్సీకి ఎనిమిది మార్కులు ఇచ్చి.. ఆట విషయానికి వచ్చే సరికి బాగా ఆడుతుంటాడు అని చెప్పింది.

దీప్తిని మిస్ అవుతున్నట్టు నాకు ఎక్కడా అనిపించలేదు అని మధ్యలో పుల్ల వేసేందుకు నాగ్ ప్రయత్నించగా.. షన్ను దండంపెట్టేశాడు. మా ఇంట్లో వాళ్లకు భయపడకపోయినా ఆ అమ్మాయికి భయపడతాను అని షన్ను చెప్పేశాడు.ఇక కాజల్‌కు ఏడు మార్కులు ఇచ్చింది. మొదట్లో బాగానే ఆట ఆడింది. కానీ ఇప్పుడు ఆమె వేసే ప్రతీ అడుగు మాకు తెలిసిపోతోంది. మానస్‌కు పది మార్కులు ఇచ్చింది. మానస్ బంగారు కొండ. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీ వచ్చింది అని ప్రియ చెప్పింది.

సన్నీకి 9 మార్కులు ప్రియ ఇచ్చింది. ఆటలో ఎన్నో అనుకున్నాం అవన్నీ అక్కడికే వదిలేయాలి. నా ప్లేట్లో తినే హక్కు, నా కాఫీ కప్పులో కాఫీ తాగే హక్కు ఒక్క సన్నీకి మాత్రమే ఉంటుందని ప్రియ చెప్పుకొచ్చింది.