Bigg Boss Telugu5: చ‌నిపోదామ‌నుకున్న ష‌ణ్ముఖ్‌..ఆనందంతో అనీకి ముద్దిచ్చిన స‌న్నీ

Bigg Boss Telugu5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో 47వ రోజు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. శ‌త్రువులు అంద‌రు మిత్ర‌లుగా మారారు. ముద్దులు పెట్టుకుంటూ ర‌చ్చ చేశారు. స‌న్నీ త‌న చిర‌కాల వాంఛ‌ని నెర‌వేర్చుకొని కెప్టెన్ అయ్యాడు.ఇక ఇంటి సభ్యులకు కోల్ గేట్.. స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి అనే టాస్కును ఇచ్చారు. దీంట్లో కంటెస్టెంట్లందరూ కూడా తమ జీవితంలోని స్మైల్ మూమెంట్లను చెప్పారు .

TheNewsQube-
Bigg Boss Telugu5 Episode 48 Highlights
Bigg Boss Telugu5 Episode 48 Highlights

సిరి స్టిక్కర్లు ఎవరు దొంగిలించారో అనే విషయం మీద ప్రియ, షన్నులు మాట్లాడుకున్నారు. మదర్ ప్రామీస్ అన్నాడు.. తీయలేదని చెప్పాడు. అది గనుక అబద్దమైతే ఇకపై ఎప్పుడూ ఆయన మాటలు నమ్మను అని షన్ను చెప్పుకొచ్చాడు. త‌నకు, సన్నీకి అంత ర్యాపో లేదని, తనపై జోకులు వేయడం నచ్చలేదని లోబోకు చెప్పుకున్నాడు. మరో వైపు ఇదే విషయమై మానస్‌తో సన్నీ మాట్లాడాడు.

సన్నీ, రవిల మధ్య లోబో వచ్చాడు. రవికి నీతో అంత ర్యాపో లేదు కదా? అలా ఇకపై అనకు.. నీకు నాకు ర్యాపో ఉంది.. మనం ఏదైనా అనుకోవచ్చు.. నాకు రవికి ర్యాపో ఉంది మేం ఏదైనా అనుకోవచ్చు అని సన్నీకి లోబో నచ్చజెప్పాడు. సన్నీ బాత్రూంలోకి వెళ్లిన‌ప్పుడు వేరే విషయం గుర్తుకు వచ్చి సన్నీని తలుచుకుని ప్రియ నవ్వేసింది.

Bigg Boss Telugu5 Episode 48 Highlights
Bigg Boss Telugu5 Episode 48 Highlights

ఒకసారి ఇలానే ఎదురెదురుగా ఉన్నాం.. ఐ కాంటాక్ట్ జరిగింది.. నేను నవ్వుతూ మాట్లాడుతూ చూస్తే.. మొహం చిరగ్గా పక్కకు తప్పించేశాడు. చిన్నపిల్లాడిలా. అది గుర్తుకు వచ్చి నవ్వాను. ఈ సారి ఎప్పుడైనా అలా జరిగితే.. కన్ను కొట్టి ముద్దు ఇస్తా అని కొంటెగా ప్రియ మాట్లాడింది.

ఏడోవారం కెప్టెన్సీ టాస్క్‌లో బెలూన్ మీద ఇచ్చాడు బిగ్ బాస్. బెలూన్‌లను కాపాడుకోవాలని అన్నాడు. సూది దక్కించుకున్న కంటెస్టెంట్..మిగతా కెప్టెన్సీ పోటీదారుని బెలూన్‌ను పగలగొట్టాలి. అలా చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటుందో వారే విజేత అని చెప్పాడు. చివ‌రాక‌రు వ‌ర‌కు స‌న్నీబెలూన్ అలానే ఉండిపోవ‌డంతో అత‌ను హౌజ్ కెప్టెన్ అయ్యాడు.

ఆనందంలో త‌న‌కు అంత‌గా స‌పోర్ట్ చేసిన అనీమాస్ట‌ర్‌కి ముద్దు పెట్టాడు. సెన్సార్ లేకపోతే ఇంగ్లీష్ కిస్ ఇచ్చేవాడిని అని మాస్టర్‌తో సన్నీ అన్నాడు. అదే స్పీడులో సన్నీ.. ప్రియతో కూడా ముచ్చటించాడు. మీకు ఏ పని ఇష్టం, ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో కనుక్కుని అదే పని ఇవ్వాలని అనుకున్నాను అంటూ ప్రియతో ఎంతో కూల్‌గా సన్నీ మాట్లాడాడు.

Bigg Boss Telugu5 Episode 48 Highlights
Bigg Boss Telugu5 Episode 48 Highlights

ఇంత నైస్‌గా మాట్లాడుతుంటే జీర్ణించుకోలేకపోతోన్నాను అని ప్రియ కొంటెగా మాట్లాడింది. ఈ ఇంట్లో మొదటగా కనెక్ట్ అయింది కూడా మీతోనే అని ప్రియతో సన్నీ పులిహోర కలిపేశాడు. ఇంత వరకు మన మధ్య మిస అండర్ స్టాండింగ్‌లు జరిగాయి.. ఇకపై అర్థం చేసుకోండి అంటూ క‌లిసిపోయారు.

ఇంటిసభ్యులందరూ వారు జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్పాలంటూ ఓ టాస్క్‌ ఇచ్చారు. మొదటగా సన్నీ మాట్లాడుతూ.. ‘అమ్మ పేరు కళావతి. ఒక మహిళ ముగ్గురు అబ్బాయిలను పెంచడం అనేది ఎంత చాలెంజింగో నాకు బాగా తెలుసు. మా డైరెక్టర్‌ పేరు కృష్ణ. నేను ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నప్పుడు చాలామంది నన్నెన్నో మాటలు అన్నారు. అవి విన్నాక నా వల్ల కాదు, వాళ్లే నీ ఆశీర్వాదం, వాళ్లందరూ నిన్ను పొగిడేలా చూసుకో అని ధైర్యం నూరిపోశాడు. అలా నా ప్రయాణం మొదలై ఇక్కడిదాకా వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు.

తర్వాత షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్‌ చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు. వాడివల్లే నేను బతికున్నాను. వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన పేరెంట్స్‌, కజిన్స్‌కు రుణపడి ఉంటా’ అని పేర్కొన్నాడు.

జెస్సీ మాట్లాడుతూ.. ‘నాన్న చనిపోయాక చదువుతూ పార్ట్‌ టైం జాబ్‌ చేశాను. ఒకసారి లైవ్‌లో ఫ్యాషన్‌ షో చూశా, ఇదే నాకు సరైనది అనిపించింది. కానీ అక్కడున్న సీనియర్‌ మోడల్స్‌ నన్ను ఎగతాళి చేశారు. నిజానికి నాకు గొంతు సరిగా లేదు. పుట్టుకతోనే దేవుడు నాకా లోపాన్నిచ్చాడు. కానీ నేను దాన్ని దాటుకుని ముందుకు వెళ్లి వారిని ఓడించి టైటిల్‌ కూడా విన్‌ అయ్యాను. గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కాను. కానీ ఎప్పుడూ మా అమ్మ నేను మోడల్‌ అని బయటకు చెప్పుకోలేదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందో అప్పుడు అందరి ఇంటి తలుపులు కొట్టి మరీ నేను మోడల్‌ అంటూ చాటింపు చేసింది’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.

సిరి తన జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయింది. ‘నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకోబోగా అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ అన్నారు తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి! అన్నారు. అప్పుడే డిసైడ్‌ అయ్యాను. నేనేంటో చూపిస్తానని! ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌ వచ్చి కెరియర్‌ ప్రారంభించాను’ అని పేర్కొంది.

అనంతరం తిననంటూ మారాం చేసిన సిరికి గోరుముద్దలు తినిపించాడు షణ్ను. తర్వాత సన్నీని చూసి సడన్‌గా నవ్వేసింది ప్రియ. తన ప్లేటేంటి? నా టీ కప్పు ఇచ్చినా కడిగేసాడంటూ పడీపడీ నవ్వింది.