Bigg Boss Telugu 5: నోటికొచ్చిన‌ట్టు మాట్లాడిన ప్రియ‌..ద‌మ్మంటే కొట్ట‌మ‌న్న స‌న్నీ

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌజ్ ర‌ణ‌రంగంగా మారుతుంది. నామినేష‌న్ టాస్క్‌లు, కెప్టెన్సీ టాస్క్‌లు, బెస్ట్‌, వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్ అంటూ ప‌లు టాస్క్‌లు ఇస్తూ హౌజ్‌మేట్స్‌ని తెగ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడు బిగ్ బాస్. బుధవారం నాటి 46వ‌ ఎపిసోడ్‌లో హౌజ్ మేట్స్ కొట్టుకునేంత ప‌ని చేశారు.త‌మ‌ని అంద‌రు చూస్తున్నార‌న్న విష‌యం మ‌రిచ‌పోయి రెచ్చిపోయారు.

Bigg Boss Telugu5 Episode 46 Higlights
Bigg Boss Telugu5 Episode 46 Higlights

కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశ్వకు స్పెషల్‌ పవర్‌ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. అయితే దాని కోసం ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను కూడా ఇచ్చాడు బిగ్‌బాస్‌.

విశ్వ త‌న‌కు పోటీగా కాజ‌ల్‌ని ఎంచుకున్నాడు. ఈ ఐదు గుడ్లును పొందుకోవాలంటే.. ఒంటిపై ఒకదానిపై ఒకటి బట్టలు వేసుకోవాలని ఎవరు ఎక్కువ బట్టలు (ఒకదానిపై ఒకటి) ధరిస్తారో వాళ్లకి బోనస్ గుడ్లు లభిస్తాయని బిగ్ బాస్ స్టార్ ఇచ్చారు. దీంతో అండర్ వేర్‌ల దగ్గర నుంచి ఒకదానిపై ఒకటి బట్టలు వేసుకోవడం పోటీ పడ్డారు విశ్వ, కాజల్‌లు.

Bigg Boss Telugu5 Episode 46 Higlights
Bigg Boss Telugu5 Episode 46 Higlights

ఈ టాస్క్‌లో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేస్తూ కనిపించాడు. అయితే కాజల్‌‌తో ఎక్కువ బట్టలు తొడిగించాలనే ఉద్దేశంలో.. వాష్ రూం దగ్గర ఉన్న అండర్ వేర్‌లు మొత్తం పట్టుకొచ్చేశాడు. ‘ఇవిగివిగో డ్రాయర్లు తెచ్చా? అని అనగానే ప్రియాంక ఛీ అని తెగ నవ్వేసింది. పక్కనే ఉన్న ఆనీ మాస్టర్.. అవి ఎవరి డ్రాయర్లు అని అడిగింది.. ఎవరివో నాకేం తెలుసు మేడమ్.. అక్కడ ఉంటే పట్టుకొచ్చేశా అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.

మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఒకదానిపై ఒకటి 106 బట్టలు వేసుకోగా.. కాజల్ 79 మాత్రమే వేసుకోగలిగింది. ఈ టాస్క్‌లో విజేతగా నిలవడంతో విశ్వకి బోనస్‌గా ఐదు గుడ్లు లభించాయి.అయితే విశ్వ ఒక్కో బట్టను తీస్తుండగా.. చివరికి అతని ఒంటిపై చిన్న నిక్కరు మాత్రమే మిగిలింది. అయితే అది కూడా తీసెయ్ అంటూ అతనికి సపోర్ట్ చేసిన ప్రియ ఆంటీ తెగ ఆశపడింది.

అనీ మాస్ట‌ర్ గుడ్డు సిరి దొంగిలించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో సింగిల్‌గా ఆట ఆడమంటే.. గ్రూప్‌లు గ్రూప్‌లుగా ఎందుకు ఆడుతున్నారు అని అడిగింది ఆనీ మాస్టర్. ఇక ఈ టాస్క్‌లో భాగంగా.. హౌస్‌లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని.. దొంగిలించిన పర్వాలేదని.. అలా చేయలేకపోతే కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత కోల్పోతారని జెస్సీకి చెప్పారు బిగ్ బాస్

ఈ టాస్క్‌లో సహాయకులుగా ఒకర్ని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో.. సిరి దగ్గరకు వెళ్లి నీ హెల్ప్ కావాలని అడిగాడు. అయితే షణ్ముఖ్ దగ్గర నేను తీసుకుంటా అని చెప్పి.. వెళ్లిన సిరి అతని దగ్గర ఉన్న ఎగ్స్‌ని ఇచ్చేయడానికి ఒప్పించింది. ఆ తరువాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన సిరి.. నువ్ నాపై నమ్మకం పెట్టుకుని నీ దగ్గర ఎక్స్ ఏమీ పెట్టుకోకు అని చెప్పడతో ప్రియాంక కూడా ఇచ్చేసింది.

ఆ తరువాత ప్రియ దగ్గరకు వెళ్లిన సిరి.. సేమ్ డైలాగ్ చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. అయితే ప్రస్తుతం ఉన్న గుడ్లే కాకుండా.. వాళ్లు తరువాత కూడా గుడ్లు సంపాదించకుండా చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టడంతో.. ఈ ముగ్గురు దగ్గర గుడ్లు లేకుండా చూడటం కోసం జెస్సీ తిప్పలు పడ్డాడు. అందరూ పడుకున్న తరువాత సన్నీ గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు. తను నొక్కేసిన గుడ్లులో కొన్ని మానస్‌కి పంచాడు.

అయితే సన్నీ గుడ్లు నొక్కేసిన విషయాన్ని సిరి చెవిలో ఊదేసింది ప్రియ. నేను చూడలేదు కానీ విన్నానని చెప్పింది ప్రియ. ఇక సన్నీ తన బుట్ట పక్కనపెట్టి గుడ్లు కోసం పోరాడుతుంటే.. అతన్ని టార్గెట్ చేసిన ప్రియ అతని బుట్టలో ఉన్న గుడ్లను నొక్కేయడానికి ట్రై చేసింది. అయితే సన్నీ ఆమె దగ్గరకు వచ్చి ప్లీజ్ ప్రొటక్షన్ అంటూ ఆమెను పక్కకి తోసేశాడు. దీంతో ఆమె పూల కుండీని సన్నీపై ఎత్తేసి.. నువ్ ఫిజికల్ అయితే మర్యాదగా ఉండదు అని హెచ్చరించింది.

Bigg Boss Telugu5 Episode 46 Higlights
Bigg Boss Telugu5 Episode 46 Higlights

ఫిజికల్ ఎవడు అయ్యాడు ప్రొటక్షన్ చేసుకున్నా అని సన్నీ చెప్పడంతో.. సన్నీపై చేయి చేసుకుని అతన్ని గిచ్చింది ప్రియ. అంతటితో ఆగకుండా.. ఫిజికల్ అయితే చెంప పగిలిపోద్దని నోరు పారేసుకుంది.. దీంతో సన్నీ.. మంచిగా మాట్లాడు.. నోరు పారేసుకోకు మళ్లీ చెప్తున్నా.. అని హెచ్చరించాడు. ప్రియ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడింది.

ఆ తరువాత నేను ఆడు ఈడు అని మాట్లాడలేదంటూ దొంగ ఏడ్పులు ఏడ్వడం మొదలుపెట్టింది ప్రియ. చేసేదంతా చేసేసి ఈ డ్రామాలేంటి? అని సన్నీ రియాక్ట్ అయ్యాడు. ఆ తరువాత మళ్లీ సన్నీ బుట్టను తీసి బయటపడేసి.. నేను ఇలాగే ఆడతా.. అంటూ దారుణంగా ప్రవర్తించింది. ఇంతలో సిరి వచ్చి సన్నీ గుడ్లు లాక్కోవడానికి ప్రయత్నించింది..

నేను ఆడవాళ్ల దగ్గరకు వెళ్లను.. దయచేసి వదిలెయ్ అని వేడుకున్నా సిరి వెనక్కి తగ్గలేదు. జెస్సీ గుడ్లను సన్నీ తీసిన కారణంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది. ఒకర్నొకరు దూషించుకున్నారు.ఇలా గుడ్ల విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ‌కు అంతా షాక్ అయ్యారు.