Bigg Boss Telugu5: మాన‌స్‌- ప్రియాంక పెళ్లి జ‌రిపించిన బిగ్ బాస్.. సోమ‌వారం జైలుకి వెళ్ల‌నున్న విశ్వ‌

Bigg Boss Telugu5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి.కెప్టెన్‌గా ఎంపికైన స‌న్నీ.. దానిని శ్వేత‌కు అంకిత‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అనంత‌రం బిగ్ బాస్ ‘సరైన మ్యాచ్‌ను వెతకండి అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది.

TheNewsQube-
Bigg Boss Telugu5 Epiosde 49 Highlights
Bigg Boss Telugu5 Epiosde 49 Highlights

ముందుగా శ్రీరామ్‌.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్‌ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు.

మానస్‌ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. ‘నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి’ అని తెలిపాడు. ఇక పింకీ .. ‘అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను’ అని చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu5 Epiosde 49 Highlights
Bigg Boss Telugu5 Epiosde 49 Highlights

పింకీ – మాన‌స్ బెస్ట్ క‌పుల్‌గా పలువురు చెప్పుకు రాగా, బిగ్ బాస్ వారిద్ద‌రికి చిన్న పాటి పెళ్లి చేశారు. అనంతరం వీళ్లిద్దరూ ‘గువ్వా గోరికంతో..’ పాటకు జంటగా స్టెప్పులేశారు. ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్‌ బయటపెట్టాడు ర‌వి. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది.

ఇదిలా వుంటే రవి గేమ్‌ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్‌ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు.

ఇక నాగార్జున హౌజ్‌మేట్స్ అంద‌రికి హాయ్ చెబుతూ వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మర్ ఎవ‌రో చెప్పాలంటూ ర‌వి నుండి మొద‌లు పెట్టాడు. రేషన్‌ మేనేజర్‌గా ప్రియాంక సింగ్‌ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. తర్వాత షణ్ముఖ్‌.. సిరిని వరస్ట్‌ పర్ఫామర్‌ అని తెలిపాడు. సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్‌ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నారు.

Bigg Boss Telugu5 Epiosde 49 Highlights
Bigg Boss Telugu5 Epiosde 49 Highlights

వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఎంపికైన విశ్వ సోమ‌వారం జైలుకి వెళ్ల‌నున్నాడు. ఇక ప‌దే ప‌దే చెంప ప‌గ‌ల‌గొడ‌తాను అని ప్రియ అన‌డంతో ఆవిష‌యంపై సుతిమెత్త‌గా క్లాస్ పీకాడు నాగ్. ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్‌ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్‌ ఇచ్చాడు నాగ్‌.

ఇండివిడ్యువల్‌ టాస్క్‌ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్‌, మానస్‌- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్‌ కాలేకపోయానని ఎమోషనల్‌ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్‌ పర్ఫామర్‌ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు.

బిగ్‌బాస్‌ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్‌. హౌస్‌ను ఎంత గలీజ్‌ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌.. ‘తోపు, డూపు’ గేమ్‌ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్‌ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్‌ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే!