Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ వీరేనంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం

Bigg Boss: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతున్న విష‌యం తెలిసిందే. తెలుగ‌, త‌మిళ భాష‌లలో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కు సంసిద్ధంగా ఉంది. క‌రోనా లేక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు షో ప్రారంభ‌మై ఉండేది. కాని సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. జూలైలో ప్రారంభం అవుతుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో ప్ర‌స్తుతం జూమ్ ద్వారా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేస్తున్న‌ట్టు స‌మాచారం. నాలుగో సీజన్ కూడా కరోనా కాలంలో వచ్చింది. అందులో ఎంపిక చేసిన కంటెంస్టెంట్స్ ఒక్కొక్కరిని రెండు వారాల పాటు క్వారంటైన్ చేసిన తర్వాత కానీ ఇంట్లోకి పంపించలేదు. ఇప్పుడు ఐదో సీజ‌న్‌లోను అలానే చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది.

Bigg Boss Telugu

జూలైలో క‌నుక సీజ‌న్ 5 స్టార్ట్ అయితే పూర్త‌య్యే స‌రికి న‌వంబర్ అవుతుంది. మ‌ళ్లీ వెంట‌నే త‌ర్వాతి సీజ‌న్ కూడా వ‌స్తుంది కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా సీజ‌న్ 5ని పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లువురు పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ సీజన్‌లో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హైపర్‌ ఆది, శేఖర్‌ మాస్టర్‌, మంగ్లీలు అనేక కార్య‌క్ర‌మాల‌దో బిజీగా ఉన్నారు. ఇలాంటి సంద‌ర్భంలో బిగ్ బాస్ లోకి వెళ‌తారా అన్న‌ది అనుమానంగా మారింది.

Bigg Boss Telugu

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ అమ్మ‌డికి కూడా బిగ్ బాస్ నుండి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, త్వ‌రలోనే దీనిపై క్లారిటీ ఇస్తుంద‌ని అంటున్నారు. వాస్తవానికి బిగ్‌బాస్ 5ను ఈ వేస‌విలో ప్రారంభించాలని స్టార్ మా నిర్వాహ‌కులు భావించారు. ​​కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉండ‌డం వ‌ల‌న అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఐదో సీజ‌న్‌ను షురూ చేయ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారని తెలుస్తుంది. నాగార్జున‌నే మ‌ళ్లీ హోస్ట్‌గా ఉంటార‌ని స‌మాచారం.

Bigg Boss Telugu