Bigg Boss Telugu 5: ఏడో వారం ఇంటి నుండి వెళ్ల‌నున్న మ‌హిళా కంటెస్టెంట్..!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.తెలుగులో ఈ షో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా, గత నెలలో ఐదోది కూడా ప్రారంభం అయింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

Bigg Boss Telugu5 Seventh Week Priya Eliminated
Bigg Boss Telugu5 Seventh Week Priya Eliminated

ఎన్నో అంచనాల నడుమ గత నెలలో ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. అలా రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోందీ సీజన్.

సీజ‌న్ 5లో ఎక్కువ మంది మ‌హిళా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావ‌డం ఆశ్చర్యం క‌లిగిస్తుంది. మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారంలో శ్వేతా వర్మ‌లు ఎలిమినేట్ అయ్యారు.ఇప్పుడు ఏడో వారంలో కూడా మ‌హిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ సరికొత్తగా జ‌రిగింది. నామినేష‌న్స్‌లో ఏకంగా తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. నేరుగా నామినేట్ అయిన లోబోతో పాటు ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, ప్రియ, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్ర, జస్వంత్ పడాల ఉండ‌గా, ప్రియ ఈ వారం ఎలిమినేట్ కానుంద‌ని అంటున్నారు.

గ‌త కొన్ని వారాలుగా సేవ్ గేమ్ ఆడుతూ వ‌చ్చిన ప్రియ ఏడో వారం ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా అనిపిస్తుంది. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ త‌ప్ప ఎలిమినేట్ అయిన వారంద‌రు మ‌హిళా కంటెస్టెంట్స్ కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. హ‌మీదా రీ ఎంట్రీ ఇస్తుంద‌ని అంటున్నారు.