Bigg Boss Telugu 5: ఎలిమినేట్ అయిన హాట్ బ్యూటీ.. ఒక్కొక్క‌రికి ఫుల్‌గా ఇచ్చిపడేసింది…!

Bigg Boss Telugu 5: సెప్టెంబర్ 5న మొద‌లైన బిగ్ బాస్ షో ఎట్ట‌కేల‌కు వారం పూర్తి చేసుకుంది. 19 మంది షోస్ హౌజ్‌లోకి ప్ర‌వేశించ‌గా, తొలివారం నామినేష‌న్‌లో ఆరుగురు ఉన్నారు. ఆ ఆరుగురిలో ఒక్కొక్క‌రిని సేవ్ చేసుకుంటూ వ‌చ్చిన నాగ్ చివ‌ర‌కి స‌ర‌యు ఎలిమినేట్ అయింద‌ని ప్ర‌క‌టించాడు. స‌ర‌యు ఎలిమినేట్ అనే స‌రికి విశ్వ వెక్కి వెక్కి ఏడ్చాడు.మిగ‌తా వారు కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే స్టేజ్‌పైకి వ‌చ్చాక స‌ర‌యు కొంద‌రిని లెఫ్ట్ అండ్ రైట్ పీకింది.

Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated
Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated

సండే ఫ‌న్ డే కావ‌డంతో హౌజ్ మేట్స్‌కి స‌రాదా గేమ్స్ ఇచ్చారు నాగార్జున‌. కొంద‌రిని జంట‌లుగా ఉండ‌మ‌ని వారితో ర్యాంప్ వాక్ చేయించాడు. వీరికి జెస్సీ, నాగ్‌ మార్కులేశారు ఎవ‌రి స్టైల్‌లో వారు ర్యాంప్ వాక్ చేసి చూపించ‌గా, ప్రియాంక జోడి మంచి మార్కులు పొందారు.

అనంత‌రం ఇంటిసభ్యులను 9 జంటలుగా విడగొట్టి ‘నేను నీకు తెలుసా?’ అనే టాస్క్‌ ఆడించాడు. ఇందులో మొదట సిరి.. జెస్సీని నువ్వెందుకంత ఓవర్‌ చేస్తావని అడిగితే.. అతడు మాత్రం ఎందుకింత త్వరగా ఎంగేజ్‌ అయ్యావని తిరిగి ప్రశ్నించాడు. దీంతో షాకైన సిరి నువ్వు వస్తావని తెలీక అని చిలిపిగా సమాధానమిచ్చింది. సిరి అసలు పేరేంటని నాగ్‌ ప్రశ్నించగా శిరీష హన్మంత్‌ అని సరైన సమాధానం చెప్పాడు జెస్సీ.

Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated
Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated

త‌ర్వాత ఉమా, స‌ర‌యు జంట రాగా, ఉమాకు రౌడీ రంగమ్మ పాత్ర సూటవుతుందని సరయూ,. సరయూకు అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ సూటవుతుందని ఉమాదేవి చెప్పింది. షణ్ముఖ్‌, విశ్వ జోడీ వంతు రాగా నాగ్‌… షణ్ముఖ్‌ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడని ప్రశ్నించాడు. దీనికి విశ్వ దీప్తి సునయన పేరు చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరి గురించి? అని గ‌ట్టిగా ప్రశ్నించడంతో వెంటనే సిరి అని టపీమని బదులిచ్చాడు.

విశ్వ లోబోను ఎత్తుకోగలడా? అన్నదానికి అతడు ఏకంగా ఎత్తుకునే చూపించాడు. ఇక ప్రియాంక క్రష్‌ ఎవరని మానస్‌ను అడగ్గా అతడు శ్రీరామచంద్ర పేరు చెప్పాడు. ప్రియాంకను చేసుకునేవాడికి ఎక్కుగా ఏం ఉండాలి? అన్నదానికి కేరింగ్‌ అని చెప్పాడు మానస్‌. ఇలా స‌ర‌దా స‌రదాగా గేమ్ సాగింది.

Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated
Bigg Boss Telugu 5 First Week Sarayu Eliminated

చివ‌ర‌కు నామినేషన్‌లో ఉన్న జెస్సీ, సరయూలకు చెరో సైకిల్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. వీరిలో ఎవరి సైకిల్‌కు లైట్‌ వెలుగుతుందో వారు సేఫ్‌ అయినట్లని చెప్తూ వారిని టెన్షన్‌ పెట్టించాడు. కొద్ది క్షణాల అనంతరం జెస్సీ సైకిల్‌ బల్బ్‌ వెలగడంతో అతడు సేఫ్‌ అని నాగ్‌ ప్రకటించాడు. సరయూ ఎలిమినేట్‌ అయిందని వెల్లడించాడు.

స్టేజ్ పైకి వ‌చ్చాక స‌ర‌యు హౌస్‌లో 5 బెస్ట్‌, 5 వరస్ట్‌ హౌస్‌మేట్స్‌ ఎవరో చెప్పుకొచ్చింది. శ్వేత స్వచ్ఛమైనదని, మానస్‌ మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడని, ప్రియాంకను ఎక్కువగా మిస్‌ అవుతాను అని చెప్పింది. విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని, హమీద తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని, కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశానని బాధపడింది.

వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్‌లో సిరి, షణ్ముఖ్‌, లహరి, సన్నీ, కాజల్‌ను ఎంచుకున్న వాళ్ల‌పై దండెత్తింది. సిరి, షణ్ముఖ్‌ ఒక స్ట్రాటజీతో వచ్చారని, బయటే అంతా ఫిక్స్‌ చేసుకుని వచ్చారని అభిప్రాయపడింది. ఇక స‌న్నీకి మొద‌టి నుండి నాపై ప‌గ ఉంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనర్‌గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసు అంటూ ఊగిపోయింది

ఇక ల‌హ‌రిని ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్‌ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు’ అని గట్టిగానే ఇచ్చిపడేసింది. తర్వాత షణ్ముఖ్‌ గురించి చెప్తూ.. అరేయ్‌ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా! అని చెప్పింది. కాజల్‌ను కూడా వరస్ట్‌ కంటెస్టెంట్స్‌ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది.