Bigg Boss Telugu 5: త్రిమూర్తుల‌ని బోల్తా కొట్టించిన బిగ్ బాస్.. బాధ‌తో ఏడ్చేసిన ష‌ణ్ముఖ్‌, సిరి

Bigg Boss Telugu 5: సీక్రెట్ రూంలో ఉన్న లోబో తిరిగి హౌజ్‌లోకి వ‌చ్చాడు.సీక్రెట్‌ టాస్క్‌లో జెస్సీ ఓడిపోయి కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఊహించని షాక్‌ తగలడంతో త్రిమూర్తులు గిలగిల కొట్టుకున్నారు. స‌న్నీ, ప్రియ‌లు క‌లిసిపోయారు. గురువారం ఎపిసోడ్‌లో ఊఃహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

Bigg Boss Telugu 5 Episode 47 Highlights
Bigg Boss Telugu 5 Episode 47 Highlights

కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మానస్‌కు స్పెషల్‌ పవర్‌ ఉన్న ఒక రెడ్‌ కలర్‌ గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. దానికి కోసం ‘స్పైసీ నూడుల్స్‌ తిను’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతనితో గేమ్ ఆడేందుకు స‌న్నీని ఎంచుకున్నాడు.

గేమ్‌లో భాగంగా కారం ఎక్కువ‌గా ఉన్న నూడిల్స్ తిన్నారు.అయితే మానస్‌ కంటే సన్నీ కొంచెం ఎక్కువగా తిని ఐదు గుడ్లను సొంతం చేసుకున్నాడు. బంగారు కోడి పెట్ట టాస్క్ ముగిసే స‌మ‌యానికి ఎక్కువగా గుడ్లు సంపాదించిన విశ్వ, మానస్‌, శ్రీరామ్‌, రవి, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక సీక్రెట్‌ టాస్క్‌ని రూల్స్‌ ప్రకారం ఆడకపోవడంతో జెస్సీని కెప్టెన్సీ పోటీకి అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌.

Bigg Boss Telugu 5 Episode 47 Highlights
Bigg Boss Telugu 5 Episode 47 Highlights

సీక్రెట్‌ టాస్క్‌లో జెస్సీ విఫలం కావడం.. కెప్టెన్సీ దారుడిగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడంతో షణ్ముఖ్‌ సహనాన్ని కోల్పోయాడు. తన స్నేహితులైన సిరి, జెస్సీలపై పిచ్చి పిచ్చిగా అరిచాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు అని షణ్ణ్నూ తెగ‌ ఫీలయ్యాడు.

జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్ వారిపై విరుచుకుప‌డ్డాడు.

ఇక లోబో హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో రవి పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. ఈ సమయంలో త్రిమూర్తులు(షణ్ముఖ్‌, సిరి, జెస్సీ) ఇంట్లోనే ఉండగా.. మిగిలిన సభ్యులంతా గార్డెన్‌ ఏరియాకు వచ్చి లోబోకి స్వాగతం పలికారు. రీఎంట్రీ ఇచ్చిన లోబోకి స్పెషల్‌ పవర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతనికి బ్లాక్‌, గొల్డెన్‌ ఎగ్స్‌ ఇచ్చాడు. వాటిద్వారా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన ఐదుగురిలో నుంచి ఒకరిని తొలగించొచ్చు.

Bigg Boss Telugu 5 Episode 47 Highlights
Bigg Boss Telugu 5 Episode 47 Highlights

మరొకొరిని కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్‌ ఎగ్‌ ఎవరికిస్తే వారు కెప్టెన్సీ పోటీదారుల నుంచి ఔట్‌ అయినట్లు. గొల్డెన్‌ ఎగ్‌ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. లోబో ఈ స్పెషల్‌ పవర్‌ ఉపయోగించి శ్రీరామ్‌ని తొలగించి, కాజల్‌ని కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక చేశాడు.

సీక్రెట్ రూం నుండి అన్నీ ప‌రిశీలించిన లోబో.. వాటిని ర‌వితో షేర్ చేసుకున్నాడు. లోబో ఇచ్చిన ఉత్సాహంతో చెల‌రేగి ఆడాల‌ని ర‌వి నిర్ణ‌యించుకున్నాడు. విశ్వకి కండబలం, నాకు బుద్ది బలం, లోబోకి రెండు ఉన్నాయని, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే ఎలా ఉంటుందో చూపిద్దామ‌ని ర‌వి అన్నాడు.