మోనాల్ కోసం అభిని, హరికను ఏకిపారేసిన నాగార్జున

బిగ్ బాస్ చివరి మజిలీకి వచ్చేసాం. ఇప్పటికే సోషల్ మీడియా లో విన్నర్ ఎవరు అనే విషయం పై రచ్చ రచ్చ నడుస్తుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉండే మోనాల్ ని ఆకాశానికి ఎత్తుకున్నాడు నాగార్జున. బెస్ట్ కెప్టెన్ కాదు అంటూ హారిక చేసిన తప్పులను వీడియోస్ రూపంలో చూపిస్తూ ఏకరువు పెట్టాడు. టాస్క్ చేయని కారణం గా అభి పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇంటి సభ్యులు చేసిన తప్పులను వారి చేతనే ఒప్పుకోవాలని అడిగాడు.

abhijeet

హరిక కు క్లాస్ పీకిన నాగ్

మొదట హరికను కన్ఫెషన్ రూమ్ కి పిలిచినా నాగార్జున అభి చేస్తున్న తప్పులను చూస్తూ కూడా సమర్దించావు అంటూ ఫైర్ అయ్యారు. ఇంగ్లీష్ మాట్లాడిన ఆపలేదు అని, టాస్క్ చేయను అంటున్న కూడా అభిని ఆడటానికి ఒప్పించలేదని, అలాగే మోనాల్ కోసం కనీసం బట్టలు త్యాగం చేయలేదని చెప్పుకోచ్చాడు. ఇక మోనాల్ ని అఖిల్ తో స్వైప్ చేయకుండా అభి తో స్వైప్ చేయడం కూడా తప్పే అంటూ హారిక ను నిలదీసాడు. చివరికి తాను చేసిన ఈ తప్పులన్నీ ఆమెతోనే ఒప్పించి ఆమె బెస్ట్ కెప్టెన్ కాదు అంటూ చెప్పించాడు.

మోనాల్ బిజినెస్ నాకద్దు: అభి

అఖిల్ హరికతో ఒకసారి తప్పుగా ప్రవర్తించానని ఒప్పుకోగా, సోహెల్ కన్ఫెషన్ రూమ్ లో దెయ్యం  కి బయపడనట్టు నటించామని, అలాగే మోనాల్ తో, అరియానా తో గొడవ పడి తప్పు చేసానని ఒప్పుకున్నాడు. ఇక అవినాష్ కూడా అరియానా దగ్గర నోరు జారడం తాను చేసిన తప్పు అంటూ బయటపడ్డాడు. అరియానా మాత్రం వరెస్ట్ కెప్టెన్ కాదు అంటూ నాగార్జున కితాబు ఇవ్వగా, ఈ వీక్ సరిగ్గా టాస్క్ లు చేయకపోవడం తన తప్పు గా చెప్పుకుంది. ఇక చివరగా అభి మాట్లాడానికి ముందే బిగ్ బాస్ చేత గేట్స్ ఓపెన్ చేయిస్తాడు నాగార్జున. అభి మోనాల్ గురించి టాస్కులు చేయకపోవడం తప్పని ఒప్పుకోవం తో కాస్త శాంతిస్తాడు. కానీ అభి పై నాగార్జున ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక అభి మోకాళ్ళ పై కూర్చొని క్షమాపణ అడగడం తో క్షమిస్తాడు. చివర్లో నాగార్జున సైతం అందరికి దండం పెట్టి ఆట బాగా ఆడండి అంటూ బ్రతిమిలాడుతాడు.

నాగార్జున పై ఫ్యాన్స్ గరం

ఇక నాగార్జున ఇంటి సభ్యుల్లో అభి మరియు హరికలపై ఎక్కువ ఫైర్ అవ్వడం పట్ల సోషల్ మీడియాలో ఒకింత అసంతృప్తి కనిపిస్తుంది. అభి ఫ్యాన్స్ అయితే మోనాల్ కి సపోర్ట్ చేయడం కోసమే నాగార్జున హరికను, అభిజిత్ ని నెగటివ్ చేసారంటూ ఫీల్ అవుతున్నారు.

Advertisement