బిగ్ బాస్ హౌస్ బయట అమ్మలదే యమజోరు..!

బిగ్ బాస్ హౌస్ లోపల సభ్యులు కుస్తీ పడుతుంటే, బయట మాత్రం అమ్మలు యమజోరుగా పోటీ పడుతున్నారు. పదహారు మందితో మొదలయిన బిగ్ బాస్ సీజన్ 4 జర్నీ ప్రస్తుతం ఫైనల్ హీట్ కి దగ్గర పడుతుంది. ఇప్పుడు హౌస్ లో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. హౌస్ మేట్స్ గెలవడానికి తమ వంతు ప్రయత్నయం తాము చేస్తుండగా, ఇక హౌస్ బయట మాత్రం వారి అమ్మల ప్రచారం ఒక రేంజ్ లో జరుగుతుంది. మరి అస్సలు ఈ అమ్మల ప్రచారం ఏంటో పూర్తి వివరాలు చూద్దాం రండి.

bb mothers

అఖిల్ సార్థక్ తల్లి:  మొదట బిగ్ బాస్ హౌస్ మేట్స్ నుండి తన కొడుకు కోసం పబ్లిసిటీ చేయడానికి మీడియా లో, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ లు ఇస్తూ హల్ చల్ చేసింది

అఖిల్ సార్థక్ తల్లి. యూట్యూబ్ లో పరసా ఇంటర్వూస్ ఇస్తూ తన కొడుకుని గంగవ్వకి దత్తత ఇచ్చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక మోనాల్ విషయంలో సైతం తనదైన స్టైల్ లో స్పందించింది. ఆమెతో ఫ్రెండ్ షిప్ పెద్దగా ఇష్టం లేనట్టుగా మాట్లాడి అఖిల్ చాలా సెన్సిటివ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో అఖిల్ పెరఫార్మెన్స్ తో పాటు బయట ఆమె ప్రచారం సైతం అఖిల్ కి కలిసి వచ్చింది

హారిక మదర్ జ్యోతి : ఈమె గురించి చెప్పక్కర్లేదు. హారిక తో కలిపి యూట్యూబ్ లో కొంత ఫేమ్ ఉన్నా జ్యోతి, హారిక బట్టలపై కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. హారిక కష్టానికి తోడు జ్యోతి మరియు ఆమె అన్నయ్య ఇంటర్వూస్ లో ప్రచారం చేయడం కూడా ఆమెకు కలిసివస్తుంది.

అభిజిత్ తల్లి లక్ష్మి : కాస్త లేట్ గా స్టార్ట్ చేసిన లక్ష్మి ప్రచారం మాత్రం లేటెస్ట్ గా ఉందనే చెప్పుకోవాలి. గత వారం హౌస్ లోకి వచ్చిన ఆమె చిలిపి మాటలకు అందరు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లో ఇంటర్వూస్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.

ఇలా తమ పిల్లల కష్టానికి తోడు ఈ అమ్మల కష్టం కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యుల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు.

Advertisement