Sohel: మాస్ లుక్కులో అదరగొట్టేశాడు.. సోహెల్ సినిమా షురూ!

Sohel బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కల గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికైనా సరే వెండితెరపై స్టార్ హీరోగా ఎదగాలనేది తన కోరిక అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, వాటిని చూసేందుకు థియేటర్లకు వెళ్తే.. అప్పటికే సినిమాను కూడా తీసేయడం, తానే టిక్కెట్లు తీసి తన ఫ్రెండ్స్ అందరికీ చూపించేవాడిని అంటూ ఎన్నో సార్లు సోహెల్ చెప్పుకొచ్చాడు.

దాదాపు పదేళ్లు ఇండస్ట్రీలోనే ఉంటున్నా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదని.. కానీ బిగ్ బాస్ వల్ల వచ్చిందని సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్‌ను వాడుకుంటూ సినిమాల్లో హీరోగా చాన్స్ కొట్టేస్తానని చెప్పాడు. అలాగే బయటకు వచ్చాక మంచి ఆఫర్లే వచ్చాయి సోహెల్‌కు. అందరికంటే ముందు హీరోగా సినిమాను ప్రకటించి.. నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరికీ షాక్ ఇచ్చాడు.

మాస్ లుక్కులో అదరగొట్టేశాడు.. సోహెల్ సినిమా షురూ!: Sohel

జార్జిరెడ్డి నిర్మాణ సంస్థ సోహెల్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లోనే అధికారిక ప్రకటన చేశారు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ అది కుదరలేదు. మొత్తానికి అసలు సిసలు అప్డేట్ వచ్చింది. సోహెల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే ఆ తరుణం వచ్చింది.

సోహెల్ హీరోగా రాబోతోన్న మూవీ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. అంతే కాకుండా ఫస్ట్ లుక్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. ఇందులో సోహెల్ మాస్ లుక్కులో అదరగొట్టేశాడు. చేతిలో సిగరెట్, ఒళ్లంతా టాటూలు.. మొత్తానికి బీ, సీ సెంటర్లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. తనపై ఇలానే ప్రేమను కురిపిస్తూ ఉండాలని సోహెల్ కోరుకున్నాడు.

Advertisement