BIGG BOSS: త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వాల‌నుకున్న బిగ్ బాస్ విన్న‌ర్.. హౌజ్‌లోకి వెళ్ళాక అతనితో క‌లిసి ఉండాల‌నిపించిదంటూ కామెంట్‌

బిగ్ బాస్.. ఇండియాస్ నంబర్ వన్ రియాలిటీ షో. బిగ్ బాస్ అంటే రూమర్లు, టాస్క్ లు, గొడవలు, ఆటపాటలు మాత్రమే కాదు. లేటెస్ట్ గా రెండు మనసులు ఒక్కటై.. ఒకర్నొకరు అర్థం చేసుకునేలా చేసిన అద్భుతమైన వేదిక. బిగ్ బాస్ హిందీ వెర్షన్ లో సీజన్ 14లో విజేతగా టీవీ నటి రుబీనా దిలైక్ నిలిచింది. ప్రైజ్‌మనీ 36 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది. అయితే అదంత సులువుగా జరగలేదు. 23 మంది కంటెస్టెంట్‌ లతో.. 143 రోజుల పాటు యుద్ధం చేసింది.

మిస్‌ సిమ్లాగా, ఆ తర్వాత మిస్‌ నార్త్‌ ఇండియాగా కిరీటాలు దక్కించుకుంది. లైఫ్‌ ఓకే చానల్‌లో వచ్చిన దేవోంకే దేవ్‌, మహాదేవ్ సీరియల్‌ లో సీత పాత్ర పోషించింది. అయితే బిగ్‌ బాస్‌ లో రుబీనాకు అన్నీ అనుకూలంగా లేవు. ఆమె ప్రతి ఒక్కరితో వాదనకు దిగేది. ఒకనొక టైమ్ లో, షో నుంచి బయటకు వెళ్లిపోతానని గొడవ చేసింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. కాని రుబీనాకు కొద్దిరోజుల్లోనే హౌస్‌లో బయట అభిమానులు ఏర్పడ్డారు. రుబీనా ప్రేమను పంచుతోంది అని హౌస్‌మేట్స్‌ అన్నారు.
రుబీనా పర్సనల్ లైఫ్ లో నటుడు అభినవ్‌ శుక్లాను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. కాని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి వాదనలు నడిచేవో ఇంట్లో కూడా అలాంటి వాదనలే నడిచేవి. దాదాపు విడాకులు తీసుకుందామని డిసైడ్ అయ్యారు. సరిగ్గా అప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి ఇన్విటేషన్ వచ్చింది.

అయితే ఈ క్రమంలో ఒకరిమీద ఒకరికి ప్రేమాభిమానాలు, అర్థం చేసుకోవడం కనిపించాయి. ఎన్నో టాస్క్ ల్లో, మరెన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో తోడుగా నిలిచారు. సల్మాన్ ఖాన్ తో రుబీనాకు గొడవ జరిగినప్పుడు కూడా భర్త అభినవ్, రుబీనాకు అర్థం అయ్యేలా నచ్చజెప్పారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో జరిగే బెస్ట్ జోడీ కాంపిటేషన్ లో రుబీనా,అభినవ్ లే బెస్ట్ కపుల్ గా నిలవడం విశేషం. గ్రాండ్ ఫినాలేలో రుబీనా బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పింది. తాము విడిపోదామనుకున్న సమయంలో బిగ్ బాస్ వారిద్దర్ని కలిపిందని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement