Bigg Boss Said About Third Pavarasta : మూడో పవర్ అస్త్ర సీక్రెట్ చెప్పిన బిగ్ బాస్.. రతిక బండారం బట్ట బయలు..!
NQ Staff - September 20, 2023 / 10:57 AM IST

Bigg Boss Said About Third Pavarasta :
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడిప్పుడే అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి అయ్యాయి. 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో నుంచి కిరణ్ రాథోడ్, షకీలా బయటకు వెళ్లారు. ఇక మూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే సాగాయి. ఇప్పటికే పవర్ అస్త్ర సాధించిన ఆట సందీప్, శివాజీలు పర్మినెంట్ హౌస్ మేట్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మూడో పవర్ అస్త్ర గురించి చెప్పాడు బిగ్ బాస్. ఇది మూడు వారాల ఇమ్యూనిటీ కలిగి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ మూడో పవరాస్త్ర కోసం ముగ్గురు కంటెండర్స్ ను స్వయంగా బిగ్ బాసే సెలెక్ట్ చేశాడు.
వారు ఎవరో కాదు అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ అని బిగ్ బాస్ వివరించాడు. దాంతో ఈ ముగ్గురు ఎగిరి గంతేశారు. అయితే మధ్యలో రతిక దూరిపోయింది. నీకు పవర్ అస్త్ర వస్తే నేను సంతోషిస్తాను అంటూ చెప్పింది. అంటే అతని మీద ఉన్న ఇంట్రెస్ట్ ను ఇలా బయట పెట్టిందన్నమాట. అయితే తనను సెలెక్ట్ చేయకపోవడంతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తెగ ఏడ్చేశాడు. అయితే బిగ్ బాస్ మరో లింక్ పెట్టాడు. ఒక్కొక్క కంటెస్టెంట్ ను పిలిచి తాను సెలెక్ట్ చేసిన వారిలో అర్హులు కాని వారు ఎవరో చెప్పాలన్నాడు. కాగా శోభాశెట్టి పేరును పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ రాయగురు చెప్పారు.
ఇక ప్రియాంక జైన్ మాత్రం అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది. ఇక సింగర్ దామిని, టేస్టీ తేజ వచ్చి ప్రిన్స్ యావర్ అనర్హుడు అని చెప్పారు. అయితే ఇక్కడే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. ఈ కటెంస్టెంట్లు కన్వెన్షన్ రూమ్ లో చెప్పిన వీడియోలను ఇంటి సభ్యులకు చూపించాడు. అందులో ప్రిన్స్ యావర్ అనర్హుడు అని చెప్పిన టేస్టీ తేజ, దామిని, రతిక వీడియోలను ప్లే చేశారు. దాంతో ప్రిన్స్ రగిలిపోయాడు. తనకు సపోర్టుగా ఉంటానని చెప్పిన రతిక ఇలా దొంగ దెబ్బ తీయడంత అతను ఎమోషనల్ అయ్యాడు. దెబ్బకు రతిక బండారం బయట పెట్టేసి ప్రిన్స్ యావర్ మైండ్ వాష్ చేశాడు బిగ్ బాస్.
దాంతో ప్రిన్స్ తెగ బాధపడిపోతూ సైకోలా బిహేవ్ చేశాడు. స్మోక్ చేస్తూ.. స్మోకింగ్ యాస్ట్రే, టేబుల్‍ను గట్టిగా కొడుతూ భయంకరంగా ప్రవర్తించాడు. దాంతో మిగతా కంటెస్టెంట్లు తెగ భయపడిపోయారు. ఇది చూసిన రతిక వణికిపోయింది. నేనేమైనా తప్పు చేశానా అంటూ ప్లే తిప్పేయాలని ప్రవర్తించింది. అయితే ప్రిన్స్ యావర్ మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. రతిక తనను అర్హుడు కాదని చెప్పిందని పెద్దగా అరవడం స్టార్ట్ చేశాడు.
ఇక ప్రిన్స్ పనులకు భయపడిపోయిన సింగర్ దామిని టేస్టీ తేజ ఇందుకే ప్రిన్స్ అర్హుడు కాదని చెప్పామంటూ వాపోయారు. ఇక మధ్యలోకి వచ్చిన శోభాశెట్టి ప్రిన్స్ ను కంట్రోల్ చేసింది. ఆమె మాటలతో కాస్త కుదుట పడ్డట్టు కనిపించాడు ప్రిన్స్ యావర్. అయితే ప్రిన్స్ మాత్రం రతిక పేరును చెబుతూ.. నువ్వు ఇలా నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదంటూ బాధపడ్డాడు.