Bigg boss: బిగ్ బాస్ ప్రేమ జంట‌ని ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!

Bigg boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌కి ఎంతో వినోదం పంచుతూ ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియను కూడా ముమ్మరం చేసేశారు.

bigg boss ott with monal and akhil1
bigg boss ott with monal and akhil1

బిగ్ బాస్ ఓటీటీకి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు దీని కోసం యాభై మంది వరకూ సంప్రదింపులు జరిపి.. షార్ట్ లిస్టును కూడా రెడీ చేశారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సీజన్ కోసం గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా తీసుకు రాబోతున్నారట. అందులోనూ మొదటి నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి మొత్తం 14 లేదా 15 మంది వరకూ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారని అంటున్నారు.

బిగ్ బాస్ ప్రేమజంటను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారని టాక్. నాలుగో సీజన్‌లో జంటగా సందడి చేసిన అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌ను ఓటీటీ వెర్షన్‌ కోసం తీసుకొచ్చేందుకు నిర్వహకులు వాళ్లతో చర్చలు జరిపారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఇందులోకి వచ్చేందుకు వీళ్లిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు.మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

bigg boss ott with monal and akhil1
bigg boss ott with monal and akhil1

బిగ్ బాస్ ఓటీటీ షోని ఎన్నో ప్రయోగాలతో మరింత రంజుగా మార్చేస్తున్నారు. తద్వారా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.